Begin typing your search above and press return to search.
బాబుకు షాకిచ్చే ప్రశ్నలడిగిన విజయసాయిరెడ్డి
By: Tupaki Desk | 5 Feb 2019 5:08 PM GMTవైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం చెబుతున్న సమాధానాలతో ఏపీ సీఎం చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయట. కేంద్రం ఏమీ చేయడంలేదు, అంతా తామే చేసుకుంటున్నామంటూ కొన్నాళ్లుగా అరిగిపోయిన రికార్డు వినిపిస్తున్న చంద్రబాబుకు ఏపీ బీజేపీ ఎదురుచెప్పలేకపోతోంది. చెబుతున్నా వారి మాటలను మీడియా బయటకు రానివ్వకుండా చేస్తోంది. కానీ, దేశ పెద్దల సభలోనే విజయసాయిరెడ్డి ప్రశ్నలడగడంతో కేంద్ర మంత్రులే అసలు సంగతులను ఆధారాలు, లెక్కలతో సహా చెప్పుకొస్తున్నారు.
ఏపీలో చేపట్టిన పథకాలన్నీ తన గొప్పదనమే అంటున్న చంద్రబాబు షాకయ్యేలా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అసలు సంగతి చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 2014-15 నుంచి 2019 ఫిబ్రవరి 2 వరకు ఆంధ్రప్రదేశ్‌కు 62 వేల 168 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ - కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక చర్యల్లో (ప్యాకేజీ) భాగంగా ఈ ప్రాయోజిత పథకాల అమలులో కేంద్రం వాటా 90శాతం, రాష్ట్రం వాటా 10 శాతం ఉంటుందని అన్నారు.
అంతేకాదు... 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకునే ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ (ఈఏపీ)ల కోసం తీసుకునే రుణాలుపై వడ్డీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి చెప్పారు. 2015-16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఈఏపీ ఒప్పందాలకు సంబంధించి 15.81 కోట్లు వడ్డీని చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు నిధులను విడుదల చేసినట్లు చెప్పారు.
చంద్రబాబు తాము ప్రతిపాదించిన ప్రత్యేక ప్యాకేజీకి తొలుత ఓకే అన్నారని... ప్రత్యేక ప్యాకేజీని ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి హోదాలో 2017 మే 2న తమకు లేఖ రాశారని కూడా చెప్పారు. ఇప్పటివరకు విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు వచ్చిన వెంటనే విడతల వారీగా తదుపరి నిధులను విడుదల చేస్తామని.. ఏపీ ప్రభుత్వానిదే ఆలస్యమని చెప్పారు.
ఇక విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్న కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినదే. ఏపీ ఏ మేరకు అప్పులు చేయొచ్చు అని ఆయన అడగ్గా.. దానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సమాధానమిచ్చారు. ఆర్థిక సంఘం విధించిన షరతులకు లోబడని దృష్ట్యా 2018-19లో 3 శాతం ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి మించి అదనంగా అప్పులు చేసే అర్హత ఆంధ్రప్రదేశ్ కు లేదని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం నిర్దిష్ట పరామితులకు లోబడి ఉన్నందున 2018-19లో అదనంగా ఎఫ్ ఆర్ బీఎం పరిమితి దాటి 2 వేల 52 కోట్ల రూపాయల వరకు రుణాలు సమకూర్చుకోవడానికి అర్హత పొందినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా రెవెన్యూలో ఏర్పడిన తీవ్ర అసమతౌల్యం కారణంగా ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని ఒకశాతం సడలించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి వచ్చిందని తెలిపారు. అలాగే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్ డీపీ)పై ద్రవ్యలోటుకు అదనంగా 2018-19లో 0.5 శాతం మేర రుణాలు సమీకరించుకోవడానికి అనుమతించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు కోరినట్లు మంత్రి చెప్పారు. పద్నాలుగో ఆర్థికసంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ విజ్ఞప్తులను పరిశీలించిన మీదట తెలంగాణకు మాత్రమే అదనంగా అప్పులు తీసుకునే అర్హత ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. అందువలన 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీపై ద్రవ్యలోటు లక్ష్యం మూడుశాతం మించకుండా 27,569 కోట్ల రూపాయలు మాత్రమే నికరంగా అప్పులు చేయడానికి సీలింగ్ విధించినట్లు మంత్రి చెప్పారు.