Begin typing your search above and press return to search.
కోడలిని వేధించే అత్తకు... బాబు ప్రతిరూపమట
By: Tupaki Desk | 6 May 2019 3:53 PM GMTవైసీపీ ప్రధాన కార్యదర్శి - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చారంటే... టీడీపీ అదినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ కు తడిసిపోవాల్సిందే. విజయసాయిరెడ్డిసంధించే సెటైరిక్ విమర్శలు అలా ఉంటాయి మరి. వేదిక ట్విట్టర్ అయినా - మీడియా సమావేశం అయినా కూడా చంద్రబాబు - లోకేశ్ లపై పంచ్ లు విసరకుండా విజయసాయిరెడ్డి ఉండలేరు. రాజకీయంగా వైరి వర్గాల్లో ఉన్న వారి మధ్య ఈ తరహా సెటైర్లు - విమర్శలు తప్పవు గానీ... విజయసాయిరెడ్డి వర్సెస్ చంద్రబాబు విషయం మరింత ఆసక్తికరమన్న మాట. సరే... ఈ సారి కూడా విజయసాయిరెడ్డి... చంద్రబాబుపై తనదైన శైలి విమర్శలు గుప్పించారు.
ఫణి తుఫాను అప్రమత్తత ఈ సారి బాగా ఉందని - చంద్రబాబు ప్రమేయం లేకపోవడంతో అధికార యంత్రాంగం మెరుగైన పనితీరును కనబరచిందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడూ తన ప్రతిష్ఠ కోసం కాసుక్కూర్చునే రకంలా మారిన చంద్రబాబు మాత్రం అధికారులకు దక్కాల్సిన ఘనతను హైజాక్ చేసేస్తారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సారి కూడా చంద్రబాబు అదే తరహా వైఖరిని అవలంబించారని కూడా విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైఖరికి సరిగ్గా సరిపోతుందన్న ఓ పోలికను తెచ్చిన విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడలిని వేధించే అత్త లాగా తనకు అధికారం లేకపోయినా... అధికారులను వేధించుకుని తింటున్నారని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శ ద్వారా చంద్రబాబును కోడలిని వేధించే అత్తలాగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు.
ఇక తుఫానుల సందర్భంగా చంద్రబాబు చేసే హడావిడి వెనుక పెద్ద అవినీతే దాగుందని కూడా విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఫణి తుఫాను కంటే ముందు వచ్చి శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తీతలీ తుఫానును చూపి కేంద్రం వద్ద వందల కోట్ల రూపాయలను తెచ్చుకున్నారని - వాటిని ఏం చేశారని ప్రశ్నించారు. అసలు తీతలీ తుఫాను కింద జరిగిన నష్టం ఎంత? కేంద్ర సాయం కోసం ప్రతిపాదించింది ఎంత? కేంద్రం విడుదల చేసినదెంత? దానిలో ఇప్పటిదాకా ఖర్చు చేసినదెంత? మిగిలిపోయిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? అంటూ విజయసాయిరెడ్డి వరుస ప్రశ్నలు సంధించారు. తుఫానుల సాయం పేరిట కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్న వైనంపై విజయసాయిరెడ్డి తనదైన శైలి విమర్శలు గుప్పించారనే చెప్పాలి. మరి వీటికి టీడీపీ శిబిరం నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాలి.