Begin typing your search above and press return to search.
పవన్ కు సూపర్ పంచ్ పడిందిగా..
By: Tupaki Desk | 26 Oct 2019 11:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పంచ్ పడింది. పదే పదే పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు విరుగుడుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే పంచ్ వేశారు. కొద్ది రోజులుగా పవన్ జగన్ - వైసీపీని టార్గెట్ చేసే క్రమంలోనే పవన్ కు ఈ కౌంటర్ పడింది. ఇంతకు విజయసాయిరెడ్డి పవన్ కు వేసిన పంచ్ ఏంటో ఓసారి చూద్దాం.. చేసేది నీడతో యుద్దం. ఎవరో ఉసగొల్పితే కత్తి చేతికిస్తే రప్పరప్ప తిప్పుతుంటాడు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే ముందు తన బాస్ నారా చంద్రబాబు నాయుడి కుటుంబం గురించి, మొన్నటి ఎన్నికల్లో తన అన్నకు నర్సాపురం ఎంపీ సీటు ఎందుకిచ్చాడో వివరణ ఇస్తే బాగుండేది అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఆయన చేసిన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు నాయుడికి కూడా ట్యాగ్ చేశాడు. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ దుమారాన్నే లేపుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ఏపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని వారసత్వ రాజకీయాలపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే పవన్ చేస్తున్న ఈ ఆరోపణల్లో వాస్తవం లేనప్పటికి జగన్ వారసత్వంతో సీఎంగా కాలేదు అన్నది అందరికి తెలిసిందే. కానీ ఎందుకో ఆయన చేస్తున్న ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు కౌంటర్ రాలేదు. ఇప్పుడు అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్ తో జనసేనాని ఆలోచనలో పడొచ్చు.
టీడీపీలో వారసత్వంగా చంద్రబాబు తన కొడుకును కనీసం ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేశారు. తన వారసుడిగా ప్రకటించుకున్నాడు. మరి పవన్ కూడా తన అన్న మెగాస్టార్ చిరంజీవి నుంచి రాజకీయ వారసత్వం పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఇక గత ఎన్నికల్లో పవన్ తన చిన్నన్న నాగబాబును నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయించాడు. కుటుంబంలో సీట్లు పదవులు ఇస్తున్నప్పుడు జగన్ ను ఎందుకు ? టార్గెట్ చేసుకుని జనసేనాని ఆరోపణలు చేస్తున్నాడనే కారణం తోనే విజయసాయి పవన్ కు పంచ్ వేశారని అర్థమవుతుంది. ఇప్పడు ఈ పంచ్ కు జనసేనాని ఎలా ? స్పందిస్తాడో చూడాలి.