Begin typing your search above and press return to search.
పవన్ పై మరోసారి సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి ...!
By: Tupaki Desk | 18 Dec 2019 12:42 PM GMTఆంధ్రప్రదేశ్ రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అని సభ లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికాకు కూడా మూడు రాజధానులున్నాయని - ఏపీలో కూడా మూడు రాజధానులు ఉంటే తప్పేంటని చెప్పారు. ఒకటి అమరావతి, మరోటి విశాఖపట్నం - ఇంకోటి కర్నూలు అని ప్రతిపాదించారు.
కానీ , సీఎం జగన్ సభలో రాజధాని పై ఆలా ప్రకటన చేసారో లేదో అప్పుడే - జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట అంటూ సీఎం పై ఫైర్ అయ్యారు. అయితే - జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందనపై వైసీపీ కీలక నేత - ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు
"రాజధాని మూడు చోట్ల ఉంటే తప్పేమిటని సీఎం జగన్ గారు అలా అన్నారో లేదో... యజమాని కంటే ముందే బానిస మొరుగుతున్నాడు.. అమరావతికే దిక్కులేదు మూడు నగరాలెలా కడతారని తన అజ్ఞానాన్ని చాటుకున్నాడు'' అని, కర్నూలు - విశాఖ ఇప్పటికే అభివృద్ది చెందిన నగరాలు అనే విషయం కూడా ఆయనకి తెలియదా? అంటూ కొంచెం ఘాటుగా స్పందించారు. ఇక, అమరావతిని ఎటూ కాకుండా చేసిన పాపం చంద్రబాబుదే అని చెప్పాడు.