Begin typing your search above and press return to search.
విజయసాయి రెడ్డి సంచలనం: బాబు ఫోర్త్ జెండర్
By: Tupaki Desk | 19 July 2018 10:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు తీరును తీవ్రంగా తప్పుపట్టిన విజయసాయి రెడ్డి కాస్తంత ఘాటుగానే బాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బాబు ఫోర్త్ జెండర్ అని.. ప్రకృతిలో ఆయన ఎటూ కాని వ్యక్తిగా విమర్శించారు. ఫోర్త్ జెండర్ అంటే ప్రకృతి కార్యంలోనూ ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేసే వ్యక్తిగా అభివర్ణించారు.
ఏపీకీ ముఖ్యమంత్రిగా ఉంటూ.. ఫోర్త్ జెండర్ గా ప్రజలను మోసం చేశారన్నారు. కాలానికి తగ్గట్లుగా రంగులు మారుస్తారంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన బాబు తీరును తప్పు పట్టారు.
బీజేపీతో ఒకవైపు రహస్య ఒప్పందం చేసుకొని వారితో రిలేషన్ కొనసాగిస్తూనే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నట్లుగా ఫైర్ అయ్యారు. మోడీ సర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న పెద్దమనిషి.. ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు పెట్టినట్లు? అని ప్రశ్నించారు.
యూటర్న్ తీసుకోవటం చంద్రబాబుకు అలవాటుగా ఆయన ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతు ఇస్తామని చెప్పామని.. గతంలోనూ అలానే వ్యవహరించినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ దొంగల పార్టీ అని.. అయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన ఆవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు.