Begin typing your search above and press return to search.
పవన్ కు వైసీపీ గ్రీన్ సిగ్నల్
By: Tupaki Desk | 5 Feb 2017 7:38 AM GMTసరే.. పవన్ అంతగా అడుగుతుంటే ఏం చేస్తాం.. ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు కలిసి రావాలంటూ వైసీపీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానించిన నేపథ్యంలో వైసీపీ స్పందించింది. ఏపీలో ప్రధాన పార్టీగా ఉంటూ ఇంకా ఏమీ నిరూపించుకోని జనసేనతో జట్టు కట్టడంపై తొలుత వైసీపీ ఏమాత్రం రెస్పాండు కానప్పటికీ తాజాగా మాత్రం సరే చూద్దామన్నట్లుగా రెస్పాన్సు ఇచ్చింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ఆపేందుకు జనసేన సహా - సీపీఐ - సీపీఎం తదితర ఏ పార్టీలతోనైనా పొత్తుకు సిద్ధమని ఆ పార్టీ నేత - ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన క్రమంలో తమతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామని, వారితో కలసి పోరాడేందుకు సిద్ధమని విజయసాయి అన్నారు.
అయితే.. కాంగ్రెస్ - బీజేపీతో మాత్రం కలిసేది లేదని విజయసాయి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎన్నడూ విశ్వసించే అవకాశం లేదని, అటువంటి ద్రోహం చేసిన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకోబోమని తేల్చేశారు. బీజేపీతో సంబంధాలకు కూడా తాము సిద్ధంగా లేమనన్నారు. బీజేపీతో పొత్తు కోసం గతంలోనే ఆఫర్ వచ్చినా తాము ఆసక్తి చూపలేదని చెప్పేశారు.
ఇదే సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ - తమతో చేతులు కలుపుతామని ముందుకొస్తే కాదనడం ఎందుకన్నారు. తమ పోరాటాన్ని సమర్థించేవారిని ఎప్పుడైనా స్వాగతిస్తామని, వారితో కలసి పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/