Begin typing your search above and press return to search.
బన్నీపై సడన్ గా ఆయనకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో?
By: Tupaki Desk | 12 Sep 2022 2:30 PM GMTఐకాన్ ఐస్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలైన `పుష్ప` దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ అనూహ్యంగా విజయాన్ని సాధించి రికార్డులు సృష్టించింది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో హిందీ బెల్ట్ లో రూ. 100 కోట్లు వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది.
అయితే ప్రపంచ వ్యాప్తంగా సాంగ్స్, మేనరిజమ్, డైలాగ్స్ తో వైరల్ గా నిలిచిన ఈ మూవీ రిలీజ్ టైమ్ లో ఏపీలో టికెట్ రేట్ల సమస్య తలెత్తింది. ఏపీ ప్రభుత్వం స్టార్ సినిమా రిలీజ్ అయినా సరే అతి తక్కవ టికెట్ రేట్లనే అమ్మాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ రేట్లు పెంచడానికి వీళ్లేదని జీవోని జారీ చేసింది. దీంతో చేసేది లేక చాలా వరకు భారీ చిత్రాలు అదే రేట్లకు ప్రదర్శించారు. దీంతో కొంత మంది నష్టాలని కూడా ఎదుర్కొన్నారు.
ఈ విషయంలో బన్నీ నటించిన `పుష్ప` కూడా భారీగానే ఏపీలో నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఈ మూవీకి సైమా అవార్డుల్లో ఏకంగా ఆరు విభాగాల్లో ఆరు అవార్డులు దక్కడం విశేషం. బెంగళూరులో శనివారం జరిగిన సైమా అవార్డుల వేడుకలో `పుష్ప`కు ఆరు అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకుడు విజయ్ సాయి రెడ్డి `పుష్ప` టీమ్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించడం ఆసక్తికరంగా మారింది.
`పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న 'పుష్ప' చిత్రం యూనిట్ కు అభినందనలు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతం. తెలుగు సినిమా 'తగ్గేదే లే' అని నిరూపించారు` అని విజయ సాయి రెడ్డి ట్విట్ చేశారు. ఉన్నట్టుండి బన్నీపై విజయ సాయి రెడ్డికి ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.