Begin typing your search above and press return to search.
బాబు బ్యాచ్ కు దడ పుట్టేలా విజయ సాయి రెడ్డి ట్వీట్స్!
By: Tupaki Desk | 6 March 2019 11:09 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో డేటా చౌర్యం హాట్ టాపిక్ గా మారింది. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని భారీగా పెంచేస్తూ వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై బాబు వర్గం.. జగన్ వర్గం మీడియా ముందు.. సోషల్ మీడియా ముందు తమ వాదనల్ని వినిపిస్తున్నారు. తీవ్ర వ్యాఖ్యల్ని చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతి అంశంపైనా ఇటీవల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తున్న ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. మర్యాదల్ని కాస్త పక్కన పెట్టేసి.. ప్రత్యర్థిని దుమ్ము దులిపినట్లుగా దులిపేస్తున్న ట్వీట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ఓవైపు హాట్ హాట్ విమర్శలు చేస్తూనే.. మరోవైపు పేలిపోయే పంచ్ లుగా కొన్ని ఇమేజ్ లను పోస్టు చేస్తున్నారు.
తాజాగా డేటా చౌర్యంపై బాబు బ్యాచ్ చేస్తున్న విమర్శల్ని తిప్పి కొడుతూ బలమైన వాదనను వినిపిస్తూ కొన్ని ట్వీట్లు చేశారు. విజయసాయి ట్విట్టర్ ఖాతాలో పోస్టు అవుతున్న పోస్టులకు సమాధానం చెప్పలేక తమ్ముళ్లు తల పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తమపై వెల్లువెత్తుతున్న విమర్శలకు సమాధానం చెప్పటం పెద్ద సవాలుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ప్రజలు ఉలిక్కిపడేలా కొన్ని వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
తాజాగా విజయసాయి రెడ్డి ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టుల్ని చూస్తే..
+ ఏపీ ప్రజలు తక్షణం తమ ఏటీఎం - క్రెడిట్ కార్డుల పాస్ వర్డులను మార్చుకోవాలి. అకౌంట్లలోని డబ్బు లూటీ అయ్యే ప్రమాదం ఏర్పడింది. కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సిన వ్యక్తే.. కన్నబిడ్డల వ్యక్తిగత సమాచారాన్ని బజారులో పెట్టాడు. తండ్రీ కొడుకులిద్దరు సైబర్ సాబోటేజ్ కు పాల్పడ్డారు.
+ దొంగే - దొంగ అని అరవటం, ఎదురు దాడులు - కుల మీడియా ద్వారా అబద్దపు కథనాలు... ఎన్ని చేసినా తప్పు చేసినోళ్లు తప్పించుకోలేరు. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకి కొట్టుకు పోయినట్టు నక్క జిత్తుల కుట్రలకు తెర పడినట్టే. రేపో మాపో షెడ్యూలు వస్తుంది. ఎన్నికల క్షేత్రంలో తేల్చుకుందాం.
+ నాలుగేళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుటి సీన్ రిపీట్ అయింది. ఎదురు దాడి - పొంతన లేని విమర్శలు - వణుకుడు సేమ్ టు సేమ్ అప్పట్లాగే ప్రవర్తిస్తున్నాడు. మంత్రులు - డిజిపి - అడ్వొకేట్ జనరల్ లతో సంతాప సమావేశాలు. ఏం లేక పోతే ఈ విషాద వీచికలేమిటి చంద్రబాబూ?