Begin typing your search above and press return to search.
బాబు దుర్మార్గాన్ని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి ట్వీట్లు
By: Tupaki Desk | 28 July 2019 1:05 PM GMTనీతులు చెప్పే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ప్రతి విషయంలోనూ ఆయన గురివింద సూత్రాన్ని అస్సలు మిస్ కారనే చెప్పాలి. నిజానికి ఈ రోజు తెలుగు రాజకీయాలు ఇలా ఉన్నాయంటే కారణంగా.. బాబేనన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.
గడిచిన కొద్దికాలంగా చంద్రబాబు చేసిన తప్పుల్ని కళ్లకు కట్టినట్లుగా తన ట్వీట్లతో చూపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. హింస.. విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా? చంద్రబాబు అంటూ కడిగేసినట్లుగా వ్యాఖ్యానించిన విజయసాయి.. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసిన ఎన్ని బస్సులు తగలబెట్టాలి? ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నేతలకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా? అంటూ దులిపేశారు.
రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీదంటూ చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు పట్టారు విజయసాయిరెడ్డి. బాబు మీద ఇంత ఘాటుగా ట్వీట్ ఫైర్ అయిన విజయసాయి వ్యాఖ్యలపై బాబు బ్యాచ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.