Begin typing your search above and press return to search.
ఆ సొత్తుతో ఆదుకోండి బాబు.. లేకుంటే లావైపోతారంటూ ట్వీట్ పంచ్
By: Tupaki Desk | 13 Sep 2019 7:20 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు తరచూ ట్వీట్ పంచ్ లు సంధించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి రియాక్ట్ అయ్యారు. బాబును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. ఏడుపుగొట్టు చర్యలతో బాబు మరింత పతనమవుతున్నారంటూ మండిపడ్డ ఆయన.. ఎన్టీఆర్ - కథానాయకుడు.. మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని అన్నారు.
వరుస పరాజయాల వేళ.. తాజాగా ఆయన తీసి వదిలిన మరో చెత్త సినిమానే ఛలో ఆత్మకూర్ అన్నారు. సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి దూసుకెళుతుంటే.. ఏడుపుగొట్టు చర్యలతో బాబు మరింత పతనమవుతున్నారన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారీ వేలాదిమంది నిరాశ్రయులవుతారని.. ఇళ్లు.. పంటలు దెబ్బ తింటాయన్నారు. ఇది అందరికి కనిపించే విషాద దృశ్యం కానీ.. వరదలు తెచ్చే ఇసుక బాబుకు కనకవర్షం కురిపిస్తుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
దోచుకున్న సొత్తులో కొంత అయినా బాధితులకు అందజేసి ఆదుకోవాలని.. లేకుంటే లావైపోతారన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయసాయిరెడ్డి.. తాజాగా బాబు మీద సంధించిన వ్యంగ్య ట్వీట్లు వైరల్ గా మారాయి.