Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు స్లీపర్ సెల్స్ ఉన్నాయంటున్న వైసీపీ ఎంపీ!
By: Tupaki Desk | 16 March 2020 2:30 PM GMTవ్యవస్థలో చంద్రబాబు నాయుడు తన స్లీపర్ సెల్స్ ను కలిగి ఉన్నారని అంటున్నారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాపై తీవ్రంగా ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి ఆ మేరకు వరస ట్వీట్లు చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రశాంతత ఉండటానికి వీల్లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాద సంస్థలతో పోలుస్తూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి.
'' చంద్రబాబు సిఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదని వ్యవస్థల్లోకి ఆయన చొప్పించిన ‘స్లీపర్ సెల్స్’ కరాఖండీగా చెబుతున్నాయి. దేశం కంటే కులమే గొప్పది. మాదేవుడు బాబు అంతకంటే పెద్దోడు. ఆర్థిక సంఘం నిధులు 5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అంటున్నాయి ఈ ‘నిద్రాణశక్తులు’.
ఉగ్రవాద సంస్థలు తాము టార్గెట్ చేసిన వ్యవస్థలను విచ్ఛినం చేయడానికి మోల్స్(ద్రోహులు) - కోవర్టులు - స్లీపర్ సెల్స్ ను ప్రవేశపెడతాయి. ప్రజా సంక్షేమం కోసం కలసికట్టుగా పనిచేయాల్సిన చోట ఇలా ద్రోహులను జొప్పించడం - అదను చూసి వారు విద్వంసానికి తెగబడటం - టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా?
న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి కుల పెద్దకు ‘శరణ్య’మన్నాడు. ఇక ఎవరిని నమ్మాలి? ప్రజల చెల్లించిన పన్నుల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఈ ఊడిగం చేయడమేమిటి? కరోనా సాకుగా దొరికిందా? నియంత్రించాలని ప్రభుత్వానికి చెప్పాల్సిందిపోయి అడ్డంగా పడుకుంటే ఆగుతుందా?''
ఇలా తీవ్ర స్థాయిలో స్పందించారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఎన్నికల వాయిదాపై ఇలా తనవంతుగా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.