Begin typing your search above and press return to search.
దోమల పేరుతో బాబు బ్యాచ్ అంతగా నాకేశారా?
By: Tupaki Desk | 29 Jun 2019 8:23 AM GMTవిపక్షంలో ఉన్నప్పుడే బాబు అండ్ కోకు నిద్ర పట్టని రీతిలో ట్వీట్ల మీద ట్వీట్లు చేసి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. చేతిలో పవర్ వచ్చిన తర్వాత ఆయన దూకుడు మరింతగా పెంచారు. విపక్ష నేత గుట్లను మొహమాటం లేకుండా విప్పేస్తున్నారు. రాజకీయంలో ఎంత కరకుగా ఉంటారన్న విషయం అర్థమయ్యేలా ఆయన ట్వీట్లు ఉంటున్నాయి.
తమ మీద చేసేమాటల దాడి ప్రయత్నాల్ని సమర్థంగా తిప్పి కొడుతున్న ఆయన.. తాజాగా చేసిన ట్వీట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. తమను బద్నాం చేసేందుకు నోరు విప్పిన నేతలు మళ్లీ మాట్లాడకుండా ఉండేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు హయాంలో నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందన్న విషయాన్ని ఉదాహరణతో చెప్పేశారు విజయసాయి రెడ్డి. అంతేకాదు.. జగన్ ను ఉద్దేశించి నోరు జారి.. అంతలోనే సర్దుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమను సైతం విజయసాయి రెడ్డి అస్సలు ఉపేక్షించలేదు.
తమ అధినేతను ఉద్దేశించి మాట జారితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని తన ట్వీట్లతో చెప్పేశారు విజయ సాయి రెడ్డి. విజయవాడలో దోమలు ఆడవో.. మగవో తెలుసుకోవటానికి వీలుగా రూ.1.5 కోట్లు నాకేశారని.. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటాను సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవన్నారు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహా చేయటం తొలిసారి వింటున్నామన్నారు.
జగన్ ను ఉద్దేశించి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఘాటుగా రియాక్ట్ అయ్యారు విజయసాయి రెడ్డి. జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ? అంటూ మండిపడ్డారు. లోకేశ్ మీదా పంచ్ ట్వీట్ చేసిన విజయసాయి రెడ్డి ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
విజయసాయి రెడ్డి ట్వీట్లు చూస్తే..
+ మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం - ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది.
+ జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ?
+ విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా - అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయ స్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం.