Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ దే తుది నిర్ణ‌యం..మాల్యా లోకేష్ ఒక‌టే

By:  Tupaki Desk   |   9 Oct 2018 4:59 PM GMT
జ‌గ‌న్‌ దే తుది నిర్ణ‌యం..మాల్యా లోకేష్ ఒక‌టే
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి నేప‌థ్యంలో అన్ని పార్టీల్లో హ‌డావుడి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అపద్ధ‌ర్మ స‌ర్కారుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హాకూట‌మి పార్టీలు సైతం ఎన్నిక‌ల హ‌డావుడిలో బిజీబిజీగా ఉన్నాయి. అయితే ఈ హోరులోనే స‌హ‌జంగా మిగ‌తా పార్టీల నిర్ణ‌యంపై ఆస‌క్తి నెల‌కొంటుంది. ఇలా తాజాగా ఆస‌క్తినిని రేకెత్తిస్తున్న పార్టీ వైసీపీ. రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణలో వైసీపీ పోటీ చేయ‌డంపై పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన సందర్భంగా జరిగిన ఆత్మీయ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఆఖరి రోజులు వచ్చాయని అన్నారు. అందుకే అవినీతి - పొత్తుల పేరుతో ఎత్తుగ‌డ‌లు వేస్తోంద‌న్నారు. ఆదాయపన్ను శాఖ దాడులు అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఐదు లక్షలకోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని తిరిగి రాబడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న అవినీతి - అక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - మంత్రి లోకేష్‌ - టీడీపీ ఎమ్మెల్యేలదే ముఖ్య పాత్ర అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఖజానా నుంచి రూ.5 లక్షల కోట్లు దోచుకున్న 'నారా' కుటుంబాన్ని దేశం విడిచి వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే విజయ్ మాల్యా పారిపోయినట్లు చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను తీసుకుని విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఓ దొంగ - ఈ నాలుగేళ్ల లో రూ. 4.5 లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని మండిపడ్డారు.ముందు జాగ్రత్తగా కేంద్రం తండ్రికొడుకుల పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇక తెలంగాణ‌లో జ‌రుగుతున్న ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి విజయసాయిరెడ్డి ప్ర‌స్తావిస్తూ తెలంగాణలో పోటీపై తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలతో కూడిన మహాకూటమికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు.