Begin typing your search above and press return to search.
కియా మోటార్స్ లో కుంభకోణం.. బాబు నొక్కేసింది 500 కోట్లు..!?
By: Tupaki Desk | 24 Dec 2018 2:28 PM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై సునిశిత విమర్శలు చేసే వైసీపీ ప్రదాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా అదే తరహాలో ఘాటు విమర్శలు చేశారు. `ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల జాబితా 1st 6 స్థానాల్లో APకి స్థానం లేదు.లింగ వివక్ష,, ఆకలి నిర్మూలన,వైద్యం,సామాజిక అంతరాలు, నీటి సరఫరా,పారిశుద్ధ్యం, నేరాల అదుపు, పచ్చదనం లాంటి 16 అంశాల ప్రాతిపదికగా ర్యాంకులను ఇస్తారు.ఏపీ No:1 అని డప్పు కొట్టే పెదబాబు, చినబాబులు దీని పై స్పందించాలి`` అంటూ ఘాటుగా కౌంటర్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ సర్కారు చేసుకుంటున్న ప్రచారం పై ఆయన మండిపడ్డారు. ``కియా మోటర్స్, తిరుపతి సిలికాన్ వ్యాలీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్,విశాఖ పారిశ్రామిక వాడల ముందస్తు సమాచారం తో రియల్ ఎస్టేట్. ప్రభుత్వ రహస్యాలు ఎవరితో పంచుకోనని, రాగ ద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రమాణం చేసిన చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘన. సంపాదించిన లక్షల కోట్లు ఆయన్ను రక్షించలేవు. పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర భూకుంభకోణం. పరిటాల సునీతమ్మ, ఇరు సోదరులు, మరిది, సూత్రదారులు. పేద రైతుల భూములు బలవంతపెట్టి ఎకరం 30 వేలు కంటే తక్కువకే కొన్నారు.
కియా ప్రాంతంలో భూములన్నీ పరిటాల బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ధర్మవరం ఎమ్మేల్యే సూరి కియా పుణ్యమా అని వందల కోట్లు ఆర్జన.`` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ``కాల్వ శ్రీనివాసులు, 4 ఎమ్మెల్యేలు కియా భూకుంభకోణం కోటీశ్వరుల జాబితాలో చేరారు. అనుబంధ పరిశ్రమల వాళ్లు ఎకరం 2కోట్లకు కొనాలి. ఎడారి నేల నుంచి కోట్లు ఎలా ఆర్జించొచ్చో టీడీపీ నేతలకు తెలుసు. దోచుకున్న సొత్తుతో అనంత లోని 14అసెంబ్లీ స్థానాల్లో 500 కోట్లు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్`` అని ట్వీట్లో పేర్కొన్నారు.
``చంద్రంసారు ఏ శంకుస్థాపన చేసినా తన బినామీలు, బంధువుల రియల ఎస్టేట్ ప్రయోజనాల కోసమే. సైబర్ సిటీ చుట్టూ జయభేరి ఆస్తులే కనిపిస్తాయి. అమరావతి చుట్టూ 60 వేల ఎకరాలు ఆయన మనుషులవే. నిర్ణయానికి ముందే సమాచారం ఇచ్చి రియల్ ఎస్టేట్ ప్రారంభిస్తారు. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కడం శోచనీయం.`` అంటూ మరో ట్వీట్లో ఆయన బాబు పై విరుచుకుపడ్డారు.