Begin typing your search above and press return to search.
టీడీపీ మహానాడు ఓ తద్దినం: విజయసాయిరెడ్డి
By: Tupaki Desk | 6 July 2017 4:24 PM GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీపై వైసీపీ నేత - ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన స్పందించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి టీడీపీ మహానాడు ఓ తద్దినం అయితే వైసీపీ ప్లీనరీ వివాహ మహోత్సవమని అన్నారు. ప్లీనరీలో ప్రభుత్వ వైఫల్యాలు - వైసీపీ పోరాటాలపై చర్చిస్తామని తెలిపారు. పార్టీ నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాలకు వచ్చిన సమాచారంపై విశ్లేషించనున్నట్లు వివరించారు.
2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారని తెలిపారు. ఇప్పటికే జాతీయ ప్లీనరీ కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారని వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ బలోపేతంపై చర్చించారని పేర్కొన్నారు.
కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాడు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట గల సువిశాల స్థలంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. 12 ఎకరాల స్థలంలో నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 200 మంది ముఖ్య నేతలు కూర్చునే విధంగా వేదికను అలంకరిస్తున్నారు. భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీలో 18 తీర్మాణాలపై చర్చించనున్నారు. 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ప్లీనరీ సమావేశం జరగనుంది. సుమారు 30 వేలమంది ప్లీనరీకి హాజరుకానున్నారు.