Begin typing your search above and press return to search.

విజ‌యసాయిరెడ్డి కంప్లైంట్!... బాబు డొంక క‌దిలినట్టేనా?

By:  Tupaki Desk   |   2 March 2019 11:25 AM GMT
విజ‌యసాయిరెడ్డి కంప్లైంట్!... బాబు డొంక క‌దిలినట్టేనా?
X
నిజంగానే ఇప్పుడు ఏపీలో పెను క‌ల‌క‌లం రేగింది. ఏపీలోని ప్ర‌జ‌లంద‌రికీ సంబంధించిన కీల‌క వివ‌రాల‌న్నీ ఇప్పుడు ఓ ప్రైవేటు కంపెనీకి చేరిపోయాయ‌ట‌. ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్న ల‌బ్ధిదారుల కుటుంబాల వివ‌రాల‌తో పాటు మ‌రింత కీల‌క‌మైన స‌మాచారం స‌ద‌రు ప్రైవేట్ కంపెనీలో ఉన్న‌ట్లుగా రూడీ అయిపోయింది. ఈ మేర‌కు స‌ద‌రు ప్రైవేట్ కంపెనీపై కేసులు న‌మోదు కాగా... పోలీసుల ద‌ర్యాప్తులో ఈ కేసుకు సంబంధించిన అస‌లు గుట్టు ర‌ట్టు కానుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాల‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌న్నీ ఎలా ఉన్నాయ‌న్న ప్ర‌శ్న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తోంటే... ఈ గుట్టు ర‌ట్టు అవ‌డంతో ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ కొంప కొల్లేరైపోయిన‌ట్టేన‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఈ క‌ల‌కలం రేగ‌డానికి కార‌ణం వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌యసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు కాగా... టీడీపీ నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డిపోవ‌డం గ్యారెంటీ అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఈ క‌ల‌క‌లం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపిలోని ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌ధ‌కాల ల‌బ్ది దారుల డేటా మొత్తం చోరికి గురైందట‌. ఓ ప్రైవేట్ సంస్థ‌కు చెందిన‌ కార్యాల యం లో ఈ డేటా ఉందంటూ సాయిరెడ్డి ఫిర్యాదు చేయ‌డంతో తెలంగాణ‌కు చెందిన సైబ‌రాబాద్ పోలీసులు రంగంలోకి దిగేశారు. విచార‌ణలో భాగంగా బ్లూ ఫ్రాగ్ మొబైల్స్ టెక్నాలజీ కంపెనీపై కేసు నమోదు చేసిన సైబ‌రాబాద్ పోలీసులు... కూకట్‌ పల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓటర్ కార్డు - ఆధార్ కార్డులు ఆ కంపెనీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కంపెనీకి చెందిన మ‌రో కార్యాల‌యంలోనూ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏపిలో భారీగా ఓట‌ర్ల మార్పులు, వైరి వ‌ర్గాల‌కు ఓటేస్తార‌న్న వారి ఓట్ల తీసివేత‌లు జ‌రుగుతున్నాయంటూ కొంత కాలంగా విప‌క్ష వైసీపీ ఆరోప ణ‌లు చేస్తోంది. దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేరుగా ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవ‌హారంపై కోర్టులోనూ కేసులు న‌మోద‌య్యాయి.

ఇలాంటి కీల‌క త‌రుణంలో ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన కీల‌క వివ‌రాల‌న్నీ కూడా ఓ ప్రైవేట్ కార్యాల‌యంలో ఉన్నాయ‌న్న విజ‌యసాయిరెడ్డి ఫిర్యాదు నిజంగానే పెను క‌ల‌క‌లం రేపింద‌ని చెప్పాలి. విజ‌యసాయిరెడ్డి ఫిర్యాదు నిజ‌మేన‌న్న‌ట్లుగా పోలీసుల ద‌ర్యాప్తులో భాగంగా స‌ద‌రు కార్యాల‌యంలో ఈ డేటా ఉన్న‌ట్లుగా పోలీసులు నిర్ధారించ‌డం చూస్తుంటే... స‌ద‌రు కంపెనీకి ఈ డేటా అందించిన వారికి మాత్రం భారీ దెబ్బ ప‌డ‌నుంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. అయితే ఈ త‌ర‌హా క‌ల‌క‌లం రేగడానికి కాస్తంత ముందుగా నేటి ఉద‌యం టెలీ కాన్ఫ‌రెన్స్‌ లో భాగంగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌లు ఓట్ల‌ను తొలిగిస్తూ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. స‌రిగ్గా... చంద్ర‌బాబు ఆ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేసిన కాసేపిట‌కే... హైద‌రాబాద్ కేంద్రంగా ఓ ప్రైవేట్ సంస్థ‌లో ప్ర‌భుత్వం వ‌ద్ద ఉం డాల్సిన స‌మాచారం దొర‌కటం క‌ల‌క‌లం రేపుతోంది.