Begin typing your search above and press return to search.

పాతాళానికి జారి పోయిన చంద్రబాబు ..ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   7 Jan 2020 10:30 AM GMT
పాతాళానికి జారి పోయిన చంద్రబాబు ..ఏమైందంటే ?
X
ప్రస్తుతం రాష్ట్రం లో రాజధాని అంశం పెద్ద రచ్చగా మారిపోయింది. సీఎం మూడు రాజధానులు అని ప్రకటించిన క్షణం నుండే ఈ వ్యవహారం పై చర్చలు మొదలైయ్యాయి. దీన్ని కొంతమంది స్వాగతిస్తుంటే .. మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అమరావతిలోని రాజధానిని ఉంచాలంటూ గత సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెనక ఉండి రైతులను రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడనే విమర్శలు ఎక్కువయ్యాయి.

దీనికి తగ్గట్టుగానే అమరావతి ప్రాంతంలో భూములు భారీ ఎత్తున కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నాయకులు, టిడిపి నుంచి బిజెపి లోకి వెళ్లి నాయకులు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ మొదటి ఎప్పటినుండో ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయమై ఎంతో రీసెర్చ్ చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ను అవమానించాలని, అప్రతిష్ఠ పాలు చేయాలని చంద్రబాబు చేసిన కుట్ర బయట పడిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా లో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, 12 సార్లు సమాచారాన్ని మార్చాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయట పెట్టిందని అన్నారు.

"బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు చంద్రబాబు నాయుడు తెగబడ్డాడు. బిసిజి వికీపీడియా ప్రొఫైల్ ను ఎడిట్ చేయించి సిఎం జగన్ మోహన్ రెడ్డికి 50% వాటాలున్నాయని రాయించాడు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయట పెట్టింది. పాతాళానికి జారి పోయావు బాబూ!" అని ఆయన అన్నారు. అలాగే దళిత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై చంద్రబాబు ఆలా మాట్లాడటం సరికాదన్నారు. దళితులన్నా, బలహీన వర్గాల వారన్నా చంద్రబాబు కు ఎప్పుడూ చిన్న చూపే. ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించాడు అని, ప్రజలు తగిన బుద్ది చెప్పినప్పటికీ కూడా బాబులో ఏ మాత్రం మార్పు రాలేదని, వచ్చే అవకాశం కూడా లేదని అర్థమవుతోంది అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో చంద్రబాబు పై విమర్శలు చేశారు.