Begin typing your search above and press return to search.

మీ బినామీ ఆస్తులే లక్షకోట్లు.. జోలెపట్టి అడ్డుక్కోవడం ఏంటీ బాబు?

By:  Tupaki Desk   |   10 Jan 2020 7:44 AM GMT
మీ బినామీ ఆస్తులే లక్షకోట్లు.. జోలెపట్టి అడ్డుక్కోవడం ఏంటీ బాబు?
X
అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా చంద్రబాబు నిన్న మచిలీపట్నంలో జోలెపట్టి విరాళాలు సేకరించిన తీరుపై సెటైర్ల వర్షం కురిపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి చెడుగుడు ఆడేశారు. చంద్రబాబు జోలెపట్టి విరాళాలు సేకరించడంపై విమర్శలు గుప్పించారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ‘గంటల వ్యవధిలో కోట్ల రూపాయలు పోగు చేయగల స్థోమత ఉన్న వాళ్లు, జనాల ముందు జోలె పట్టి విరాళాలు అడగడం దేనికని’ ఎద్దేవా చేశారు.

అంతేకాదు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భూములు కొన్న మీ బినామీలు, అనుచరవర్గం ఆస్తులు లక్షకోట్లపైనే ఉంటాయని..ఒక్క గంటలో వెయ్యి కోట్లు పోగు చేసే స్థోమత ఉన్నోళ్లు మీరంతా అని.. మీరివ్వకుండా జనం మీద పడి జోలె చాపడం ఏమిటీ చంద్రబాబూ? తుపాకులు కొని సాయుధ పోరాటం గానీ మొదలు పెడుతారా? అంటూ సెటైర్లు వర్షం కురిపించారు.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి బాగానే సంపాదించారని.. బాగానే బాగుపడ్డారని.. ఇంకా జనాల ముందు ఈ జోలె పట్టి వేసే నాటకాలు దేనికి అని చంద్రబాబును చెడుగుడు ఆడేశారు విజయసాయిరెడ్డి. మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడడానికి ప్రజలను పోరాటమంటారా? మీలాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండడం మా కర్మ అంటూ చంద్రబాబు పై నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి.