Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు భయంకర మానసిక వ్యాధి.. ఇదేనట

By:  Tupaki Desk   |   27 Feb 2020 8:11 AM GMT
చంద్రబాబుకు భయంకర మానసిక వ్యాధి.. ఇదేనట
X
ట్విట్టర్ సాక్షిగా మాటల తూటాలు పేల్చే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును చెడుగుడు ఆడేశాడు. చంద్రబాబుకు అరుదైన మానసిక వ్యాధి ఉందని ట్విట్టర్ లో సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబు ‘నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలను కూడా ఆయన బయటపెట్టారు. తను లేకపోతే ప్రపంచమే లేదని ఈ వ్యాధిగ్రస్తులు బ్రాంతి చెందుతారని.. అందరూ పనికిమాలిన వారని భ్రమపడుతారని తెలిపారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడడం.. ప్రోత్సహించడం ఈ జబ్బు ప్రధాన లక్షణాలు అని ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో అయితే అసలు చంద్రబాబుది మామూలు గుండె కాదు అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు గుండె కాదు!’’ అంటూ చంద్రబాబు ఊకదంపుడు బెదిరింపులపై తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు విజయసాయి రెడ్డి.

ఇక చంద్రబాబు కమీషన్ల కోసం 15శాతం ఎక్సెస్ లు పెంచారని.. నామినేషన్లతో పనులు కట్టబెట్టి 15వేల కోట్లు దోచుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అదే సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా నాలుగు నెలల్లోనే రూ.2000 కోట్లను ఆదా చేశారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.