Begin typing your search above and press return to search.

'బాబు కొత్త డ్రామాలు మొదలుపెడుతున్నారు!'

By:  Tupaki Desk   |   10 April 2019 8:55 AM GMT
బాబు కొత్త డ్రామాలు మొదలుపెడుతున్నారు!
X
పోలింగ్ కు సమయం ఆసన్నం అవుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరుతూ ఉంది. ఆఖరి నిమిషంలో కూడా కొన్ని బదిలీలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రకాశం జిల్లా ఎస్పీ బదిలీ ఆసక్తిని రేపగా.. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అసహనంతో ఉంది. ఆ అధికారులను బదిలీ చేయాల్సింది కాదని అంటూ తెలుగుదేశం వారు విరుచుకుపడుతున్నారు. ఈ పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వి.విజయసాయి రెడ్డి వరస ట్వీట్లతో స్పందించారు.

''చంద్రబాబు కొద్ది సేపట్లో కొత్త డ్రామా మొదలు పెడుతున్నాడు. తన చెంచాలైన పోలీసు అధికారులను ఎలక్షన్ కమిషన్ విధులనుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేక ఆందోళనకు చేస్తాడట. విజయవాడ అంబేద్కర్ కూడలిలో ఇసికి, కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాకు కూర్చుంటాడట. సింపతీ కోసం కుట్రలకు తెరలేపాడు.

ఎలక్షన్ కమిషన్ ను, కేంద్ర సంస్థలను బ్లాక్ మెయిల్ చేసి తన కుల మీడియా ద్వారా ఏదో జరిగిపోతోందని భావోద్వేగాలు రెచ్చగొడతాడు. డబ్బు పంపిణీని అడ్డుకోకుండా చేసుకుంటాడు. పుట్టుకతోనే నయవంచన, కపటం, ద్రోహం వంటపట్టించుకున్న చంద్రబాబు దేనికైనా సిద్ధపడతాడు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలను ఎదుర్కోలేక ముందే ఓటమిని అంగీకరించిన వ్యక్తులే చంద్రబాబు లాగా చిల్లర పనులు చేస్తారు. పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా చూడాలన్ని ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. చేసేవన్నీ అరాచకాలు. వాటిని ఇసి కూడా అడ్డుకోవద్దు అంటే ఎలా కుదురుతుంది తుప్పు నాయుడూ?'' అంటూ వరస ట్వీట్లతో విజయసాయి రెడ్డి చంద్రబాబు మీద దుమ్మెత్తి పోశారు.

ఏపీ ఎన్నికల రణరంగం అటు తిరిగి ఇటు తిరిగి ఎన్నికల కమిషన్ మీదకు కూడా రావడం. గతంలో ఎన్నికల వేళ డీజేపీతో సహా అనేక మంది అధికారుల బదిలీలు జరిగేవి. అవన్నీ సాఫీగా జరిగిపోయేవి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈసీని తీవ్రంగా నిందిస్తూ ఉంది!