Begin typing your search above and press return to search.
బాబు బడాయిలు..విజయ సాయి రెడ్డి పంచ్ లు
By: Tupaki Desk | 27 Nov 2018 12:23 PM GMTదేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అని ప్రకటించుకొని - ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ క్రమంలో సాధించింది ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం తెలుగుదేశం పార్టీలకు కూడా అంతుచిక్కనిది అనే సంగతి తెలిసిందే. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణ అనే మాట అనేది మాత్రం మిగిలింది. ఇక అంశం ఏదైనా తానే క్రెడిట్ తీసుకునే పచ్చ పార్టీ అధ్యక్షుడిపై తాజాగా పంచ్ పేల్చారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి - పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తనదైన శైలిలో చంద్రబాబుపై సెటైర్ వేశారు. `ఆ మధ్య ఢిల్లీలో ఓ తలపండిన రాజకీయ నేత నాతో మాట్లాడుతూ - చంద్రబాబు చెప్పే బడాయిలు చూస్తుంటే ఏదో ఒక రోజు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది నేనే - భారత రాజ్యాంగం దగ్గరుండి రాయించింది నేనే అని ప్రకటించినా ఆశ్చర్యపోను అన్నారు. కలికాలం! హతవిధి!`` అని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా - ధర్మపోరాట సభల పేరుతో జరుగుతున్న ప్రచార పర్వంపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట సభల కోసం చివరికి టీటీడీ బస్సులను కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. వాటిలో మాంసం - మద్యం సరఫరా చేస్తున్నారని.. ఇది క్షమించరాని పాపమని అన్నారు. దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలికమేనని.. ప్రభుత్వ అధికారులు టీడీపీ నాయకులకు వత్తాసు పలకడం సరికాదని హితవు పలికారు. ఉపాధి హామీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు అక్రమాలకు సహకరించి అధికారులు ఇబ్బంది పడొద్దని సూచించారు.