Begin typing your search above and press return to search.

పప్పూ! నీది సార్ధక నామధేయం ... !

By:  Tupaki Desk   |   25 Dec 2019 9:56 AM GMT
పప్పూ! నీది సార్ధక నామధేయం ... !
X
ఆంధ్రప్రదేశ్‌ లో అధికారం లో ఉన్న జగన్ సర్కార్ పై బురద జల్లేందుకు ప్రయత్నం చేసిన టీడీపీ ఎమ్మెల్సీ , చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ చేసిన మరోసారి నవ్వుల పాలయ్యారు. జనాభా లెక్కల కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను.. ఎన్ ఆర్ సి కోసం ఇచ్చారంటూ ప్రభుత్వం పై ఫైర్ అవుతూ లోకేశ్‌ ఓ ట్వీట్‌ చేసారు. దీనితో ఎమ్మెల్సీ లోకేశ్‌ చేసిన ట్వీట్‌ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం ప్రభుత్వం ఇచ్చిన జీవో ని కూడా పూర్తిగా చూడకుండా ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఇలాగే అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారం పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. పప్పూ! నీది సార్ధక నామధేయం అంటూ ట్వీట్ చేశారు. 'జనాభా లెక్కలు పదేళ్ల కో సారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ని ఎన్నార్సీ అంటూ అర్థం చేసుకున్నావంటే... నీ ఇంగ్లిషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజూ ప్రెస్ మీట్ల ల్లో ఫ్రస్టేట్ అవుతున్నాడు అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

అసలు విషయం ఏమిటంటే ... జనాభా గణనకు సంబంధించి ఇటీవల ఓ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఆ జీవోను సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన నారా లోకేష్.. ‘‘వైసీపీ నాయకులు వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయట మాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. 16 ఆగష్టు 2019న ఎన్నార్సీపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం’’ అని కామెంట్ చేశారు. దీనితో విజయసాయి రెడ్డి లోకేష్ కి కౌంటర్ ఇచ్చారు.