Begin typing your search above and press return to search.
సవతి తల్లి ప్రేమ : అయినా బీజేపీకే మద్దతు మరి...?
By: Tupaki Desk | 18 July 2022 1:30 AM GMTఏపీ మీద కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోంది అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడి హోదాలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం. ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో బీజేపీ రాజ్యం సాగుతోంది. ఏనాడు అయినా కన్నతల్లి ప్రేమను ఏపీ మీద చూపించిందా. ఎపుడూ సవతి తల్లి ప్రేమనే కనబరుస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డి మళ్ళీ అవే మాటలను వల్లించారు.
పార్లమెంట్ సమావేశలకు ముందు జరిగే అఖిల పక్ష సమావేశానికి వైసీపీ తరఫున ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేక డిమాండ్లను కేంద్రం ముందు ఉంచామని ఆయన మీడియాతో చెప్పారు. ఎప్పటి మాదిరిగానే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను తీర్చాలని, అలాగే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మొత్తం నిధులు విడుదల చేయాలని కోరామని అన్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ విషయం ఎంతకూ ఎటూ తేలకపోవడం పట్ల కూడా ఆయన కేంద్రానికి తన అభ్యంతరం తెలియచేశానని చెప్పారు.
ఇలా ఏ అంశం చూసినా ఏపీ మీద కేంద్రం శీతకన్ను వేసిందని, ప్రేమను చూపించడం లేదని విజయసాయిరెడ్డి చెప్పుకున్నారు. అయితే ఇక్కడ అందరికీ కలిగే అతి పెద్ద డౌట్ ఏంటి అంటే ఇలా ఏపీ పట్ల పూర్తి ఉదాశీనతతో ఉన్న కేంద్రానికి అవసరమైన అంశాలలో పదే పదే వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తోందని, అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కనుక లేకపోతే బీజేపీ బిగ్ ట్రబుల్స్ లో పడేదని అంతా అంటారు. వైసీపీకి ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో దాదాపుగా యాభై వేల పై చిలుకు ఓట్లు ఉన్నాయి.
అవి కనుక అటు నుంచి ఇటు అయితే విపక్షానికి బాగా బలం పెరుతుంది. ఇక బీజేపీ కూడా తన అభ్యర్ధిని గెలిపించుకోవడానికి నానా హైరానా పడాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి బంపర్ చాన్స్ ని వదిలేసుకుంది వైసీపీ అని అంతా ఇప్పటికే నిందిస్తున్నారు. ప్రత్యేక హోదాని ఇస్తేనే తప్ప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని ఎందుకు షరతు విధించలేదు అన్న ప్రశ్న అయితే ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా వైసీపీ బీజేపీకి అవుట్ రేట్ గా సపోర్ట్ చేసి ఇపుడు మాత్రం బీజేపీది ఏపీ మీద సవతి తల్లి ప్రేమ అంటే జనాలు ఇంకా మండుతారు తప్ప అయ్యో పాపం అనరుగా అన్న మాట వస్తోంది.
ఏది ఏమైనా సరే కేంద్రం ఏపీ మీద వివక్ష చూపిస్తోంది అని ఆంధ్రులు రగులుతున్నారు. ఇక ఏపీలో తాము ఎన్నుకున్న ప్రభుత్వం కూడా కేంద్రాన్ని నిలదీయకపోగా తూతూమంత్రంగా కేంద్రం ఏపీని ఏమీ చేయడం లేదు అని విమర్శిస్తే సరిపోతుందా అని అంటున్నారు. మాటలలో విమర్శలు చేస్తూ చేతలలో అవసరమైన చోట మద్దతు తెలుపుతూ వస్తున్న వైసీపీ తన రాజకీయాన్ని బాగా రక్తి కట్టించవచ్చేమో కానీ జనాలు మాత్రం అన్నీ తెలుసుకునే ఉన్నారు అని అంటున్నారు.