Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్ః విజ‌య‌సాయికే పెద్ద‌ల స‌భ

By:  Tupaki Desk   |   26 May 2016 8:54 AM GMT
అఫిషియ‌ల్ః విజ‌య‌సాయికే పెద్ద‌ల స‌భ
X
రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, చార్టెడ్ అకౌంటెంట్‌ విజయసాయి రెడ్డి పోటీ చేయ‌డం ఖాయమైంది.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం లోటస్ పాండ్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును ఖ‌రారు చేశారు. అనంత‌రం  పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లి విజ‌య‌సాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ తరఫునుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాజ్యసభలో పార్టీ  వాణిని వినిపిస్తానని విజయ సాయిరెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు మూడు తరాలుగా అనుబంధం ఉందన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

వైకాపాకు అసెంబ్లీలో 67 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, వారిలో 17 మంది ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు. దీంతో వైసీపీ బలం 50 మందికి పరిమితమైంది. 41 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక రాజ్యసభ సీటు దక్కుతుంది. వైకాపాను రాజకీయంగా బలహీనపరిచేందుకు మరికొందరు ఎమ్మెల్యేలను లాక్కునేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని స‌మాచారం.