Begin typing your search above and press return to search.
అమరావతిలో బాబు ఇంటికి మహర్దశ!
By: Tupaki Desk | 11 Jun 2019 2:30 PM GMTకృష్ణా నది కరకట్టకు కాస్త అనుకొని నిర్మించిన విలాసవంతమైన భవనంలో టీడీపీ అధినేత.. ఏపీ రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఇంటిని నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ.. ఈ ఇంటినే చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తాను రాసిన మొదటి లేఖలో (దీనికి ముందు ఒక లేఖ రాసినా.. అది ఎన్నికల్లో గెలుపుపై శుభాకాంక్షలు తెలుపుతూ కాబట్టి దాన్ని లేఖలా పరిగణించలేం) తాను నివాసం ఉంటున్న ఇంటిని తనకు కేటాయించాలని ఆయన కోరారు. పార్టీ కార్యకలాపాలకు అనువుగా ఉంటుందన్న విన్నపాన్ని ఆయన చేశారు.
అయితే.. బాబు రిక్వెస్ట్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ్యుడు విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఎటకారం ఆడేశారు. విజయసాయి సమాధానం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భవనాన్ని బాబు చేత ఖాళీ చేయించటం ఖాయమన్న విషయం తేలిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ భవనాన్ని ఏం చేస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఇంటి విషయంలో రెండు ఆలోచనల్లో ఏపీ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నిర్మాణం మీద పలు విమర్శలు ఉన్న నేపథ్యంలో.. ఒకసారి క్రాస్ చెక్ చేయించి.. రిపోర్ట్ నెగిటివ్ గా వస్తే వెంటనే దానిని కూల్చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ అందుకు భిన్నంగా రిపోర్ట్ వస్తే.. ఆ భవన రూపురేఖలు మార్చి.. దాన్ని గవర్నర్ బంగాళాగా మార్చాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎందుకంటే.. ఏపీలో రాష్ట్ర గవర్నర్ కు ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక నివాసం లేదు. ప్రస్తుతం ఉన్న గవర్నర్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉండటంతో ఆయన హైదరాబాద్ కు పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు ఉంటే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అలాంటివేళ.. ఏపీ గవర్నర్ నివాసానికి అనువైన భవనం ప్రస్తుతం అమరావతిలో లేని నేపథ్యంలో బాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటికి మించింది మరొకటి లేదన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే.. బాబు నివాసాన్ని రాజ్ భవన్ గా మార్చేస్తే మంచిగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. ఇప్పటివరకూ ఉన్న బాబు ఇల్లు.. రానున్న రోజుల్లో పవర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం ఖాయం. మరి.. ఇదెంతవరకూ కార్యరూపం దాలుస్తుందో చూడాలి.