Begin typing your search above and press return to search.
ధూళిపాళ్ల అరెస్టుపై సాయిరెడ్డి కామెంట్ ఇదే!
By: Tupaki Desk | 25 April 2021 7:30 AM GMTవైసీపీ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి.. వి. విజయసాయిరెడ్డి తనదైన శైలిలో మరోసారి టీడీపీపై విరుచుకు పడ్డారు. తలాతోకలేని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే.. సాయిరెడ్డి.. ఇటీవల కాలంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎదురైన తీవ్ర ఎదురుదెబ్బతర్వాత.. కొంత తగ్గినా.. మళ్లీ చంద్ర బాబు పుట్టిన రోజు నుంచి మాత్రం రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్లపై విమర్శలు చేశారు.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు విజయం సాధించిన ధూళిపాళ్ల నరేంద్ర కుమా ర్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన చైర్మన్‌గా ఉన్న సంగం డయిరీని.. మాక్స్ చట్టం నుంచి కంపెనీ యాక్ట్ మార్చే క్రమంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ..ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం.. రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించడం తెలిసిందే. ఈ క్రమం లో దీని పై స్పందించిన సాయిరెడ్డి.. చిత్రమైన కామెంట్లు చేయడం గమనార్హం.
``టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అరెస్టు చేస్తే.. ప్రభుత్వం కుట్రపన్నిందని.. కరోనాకు భయ పడి.. ప్రజల దృష్టిని పక్కదారి పట్టించుకునేందుకు టీడీపీ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారు. పాడి రైతుల రక్తం ధూళిపాళ్ల పీల్చేశారు. అమూల్ ను నిలిపేందుకు ప్రభుత్వం నరేంద్ర ను అరెస్టు చేసిందని అంటున్న టీడీపీ నేతలు.. అమూల్ రాష్ట్రం లో ఎవరి సొత్తూ కాదు. పాడి రైతుల సొత్తు. హెరిటేజ్ మాదిరి గా.. అమూల్ ఎవరి సొంత ఆస్తీకాదు. ఈ విషయం తెలుసుకుంటే.. బెటర్`` అని సాయి రెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.