Begin typing your search above and press return to search.
కేసీఆర్ పలుకరింపు.. విజయసాయి వంగి మరీ ఆశీర్వాదం..
By: Tupaki Desk | 13 Jan 2020 2:30 PM GMTఅందరూ ఎంతో ఆసక్తికర సమావేశం సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతిభవన్ లో సాగుతోంది. ఈ భేటీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన వెంట ఆయనకు అత్యంత సన్నిహితుడు.. ఎంపీ విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. జగన్ ను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్.. వెంట వచ్చి మరీ లోపలకు తీసుకెళ్లారు. అనంతరం ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు భోజనం చేశారు.
ప్రగతిభవన్ కు ఏపీ సీఎం జగన్ వచ్చిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. జగన్ తో పాటు ఎంపీ విజయసాయి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కేసీఆర్ ఆహ్వానించి.. ఆయనతో మాట్లాడుతున్న వేళ.. విజయసాయిని గమనించారు.
ఎంపీ విజయసాయిని పలుకరించారు సీఎం కేసీఆర్. వెంటనే ముందుకు వచ్చిన విజయసాయి.. మర్యాద పూర్వకంగా కేసీఆర్ కు నమస్కరిస్తూనే.. పాదాభివందనం చేసేందుకు ముందుకు వంగారు. వెంటనే ఆయన్ను ఆపే ప్రయత్నం చేశారు కేసీఆర్. అప్పటికే సగం వంగిపోయిన విజయసాయి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వైనం అక్కడున్న పలువురిని ఆకర్షించింది. సీఎం జగన్ సైతం ఈ సీన్ ను ఆసక్తిగా గమనిస్తూ ఉండిపోయారు. గతంలోనూ విజయసాయి ప్రధాని మోడీ పలుకరించినంతనే వెళ్లి.. ఆయనకు పాదాభివందనం చేయటం తెలిసిందే.