Begin typing your search above and press return to search.
విశాఖ ప్రమాదాలపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 15 July 2020 1:30 PM GMTఏపీకి పరిపాలన రాజధానిగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఖాయం చేసిన విశాఖలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ తర్వాత వరుసగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విశాఖ పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఈ సాల్వెంట్ ప్లాంట్ ను సందర్శించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వరుస ప్రమాదాల వెనుకు కుట్రలు ఉన్నాయా? లేక లాక్ డౌన్ తర్వాత ఓపెన్ చేస్తున్నందుకు నిర్వహణ లోపాలతో ఇలా జరుగుతుందా అనే దానిపై విచారణ చేస్తామని.. కుట్రకోణం బయటపడితే ఎవరినీ వదిలేదని లేదని హెచ్చరించారు. వరుస ప్రమాదాలు చూస్తుంటే కుట్రలున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
ఇక ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50లక్షల పరిహారాన్ని విజయసాయిరెడ్డి ప్రభుత్వం తరుఫున ప్రకటించారు. ఇక గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.20లక్షల పరిహారం ప్రకటించారు.
ఇక నిన్న గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ కూడా విశాఖలో వరుస ప్రమాదాల వెనుక కుట్రలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే అనడంతో దీనిపై నిజాలు నిగ్గు తేల్చే దిశగా ప్రభుత్వం రెడీ అయినట్టు తెలుస్తోంది.