Begin typing your search above and press return to search.

డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ..నిమ్మగడ్డ లేఖ పై నిజాలు బయటపెట్టండి!

By:  Tupaki Desk   |   15 April 2020 12:43 PM GMT
డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ..నిమ్మగడ్డ లేఖ పై నిజాలు బయటపెట్టండి!
X
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసినట్టుగా బయటకు వచ్చిన ఓ లేఖ రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపుతుంది. ఈ లేఖపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కి ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది ఫోర్జరీ సంతకాలు - నకిలీ డాక్యుమెంట్లు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా రమేశ్‌ కుమార్‌ చేసిన సంతకానికి - ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదు అని తెలిపారు. సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని తమ దగ్గర సమాచారం ఉన్నట్లు డీజీపీకి రాసిన లేఖలో ఎంపీ విజయసాయిరెడ్డి" తెలిపారు.

ఇది ఖచ్చితంగా కావాలనే చేశారని - ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ - వర్ల రామయ్య - టీడీ జనార్దన్‌ ల హస్తం ఉందని - వీరంతా కలిసే ఆ లేఖను సృష్టించారని - అయితే ఈ తతంగమంతా రమేశ్‌ కుమార్‌ కు తెలిసే జరిగిందని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు - కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాల్సిందిగా లేఖలో తెలిపారు. ఈ లేఖను పోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపాలి. వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి అని - ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించాలి అని విజయసాయిరెడ్డి డీజీపీకి రాసిన లేఖలో పొందుపరిచారు.