Begin typing your search above and press return to search.

ర‌జ‌ని పొలిటిక‌ల్ ఎంట్రీ...క్యాప్టెన్‌ కు క‌ల‌వ‌రమా?

By:  Tupaki Desk   |   20 May 2017 2:46 PM GMT
ర‌జ‌ని పొలిటిక‌ల్ ఎంట్రీ...క్యాప్టెన్‌ కు క‌ల‌వ‌రమా?
X
త‌లైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ త‌న‌ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి స్ప‌ష్టంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ...త‌మిళ రాజ‌కీయాల్లో మాత్రం తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌, రాజ‌కీయ‌వ‌ర్గాలు త‌లైవా వ‌స్తే రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌నే దానిపై త‌మ‌దైన శైలిలో విశ్లేష‌ణ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ త‌లైవా రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. ర‌జనీ రంగ ప్ర‌వేశం గురించి ఒకింత లైట్ తీసుకుంటూనే న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

సుదీర్ఘ‌కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా మదురై సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ కాంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లో రావాలనుకుంటే రానివ్వండి అంటూ రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, భారతీయులకు ఆ హక్కు ఉందని విజయ్ కాంత్ వ్యాఖ్యానించారు. సినీ న‌టుడు అయిన ర‌జ‌నీకాంత్ పార్టీ పెడుతుండ‌టంతో ఓట్ల చీలిక వ‌స్తుంద‌నే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా...రజనీకాంత్ వస్తే మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. త‌మ నాయకులు, కార్యకర్తలు త‌మకుంటారని, ర‌జ‌నీ కారణంగా రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని విజయ్ కాంత్ ధీమా వ్యక్తం చేశారు.

త‌మిళ‌నాడు రాజ‌కీయాలపై క్యాప్ట‌న్ స్పందిస్తూ త‌మిళ‌నాడులో ప‌రిస్థితులు బాధాక‌రంగా ఉన్నాయ‌ని అన్నారు. గత శాసన‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఒక్క ఓటు వేస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారని అధికార‌ అన్నాడీఎంకే పార్టీ ప‌రిణామాల‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. గ‌తంలో అన్నాడీఎంకేకు మ‌ద్ద‌తు ఇచ్చిన ఉదంతాన్ని మీడియా గుర్తుచేయ‌గా అప్ప‌టి ప‌రిస్థితులు వేర‌ని చెప్పారు. ఇదిలాఉండ‌గా... క్యాప్టెన్ అనారోగ్యం ఇంకా కుదుట‌ప‌డ‌లేద‌ని తాజాగా క‌నిపించింది.యన స్వయంగా నడవలేని పరిస్థితో ఉన్నారు. ఇద్దరి సహాయంతో ఆయన నడవగలుగుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/