Begin typing your search above and press return to search.

చింత చచ్చినా పులుపు చావని విజయ్ కాంత్

By:  Tupaki Desk   |   28 Feb 2017 11:41 AM GMT
చింత చచ్చినా పులుపు చావని విజయ్ కాంత్
X
తమిళనాడు రాజకీయాలు లావా కంటే వేడెక్కిన సమయంలోనూ ఎక్కడున్నాడో తెలియకుండా పోయిన డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ తాజాగా వార్తల్లోకెక్కారు. అన్నాడీఎంకేలో ఎవరికివారు కొట్లాడుకుంటున్నా.. డీఎంకే అవకాశం కోసం కాచుక్కూచున్నా.. ఇలా అందరూ రాజకీయాలు చేస్తున్నా తాను మాత్రం రాజకీయాలు మాని పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారు.

తరచూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడే విజయ్ కాంత్ తాజాగా ఒక నాయకుడిని కొట్టారు. పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గోనేందుకు వెళ్లిన విజయ్ కాంత్ అక్కడ సొంత పార్టీ నాయకుడి మీదే దారుణంగా దాడి చేశారు. విలుప్పురం సమీపంలోని పర్నూట్టి ప్రాంతంలో మంగళవారం ఏర్పాటు చేసిన 'ఉంగకలదన్ నాన్ 'అనే కార్యక్రమానికి హాజరైయ్యేందుకు డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ బయలుదేరారు. తమ పార్టీ నాయకుడు, సినీనటుడు విజయ్ కాంత్ కు స్వాగతం పలకడానికి డీఎండీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ఆ సమయంలో ఓ నాయకుడు విజయ్ కాంత్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అంతే విజయ్ కాంత్ కు మండిపోయింది. ఆ నాయకుడి చెంప చెల్లుమనిపించిన విజయ్ కాంత్ పూనకంతో ఊగిపోయారు. విజయ్ కాంత్ నాయకుడి చెంప పగలగొట్టడంతో అక్కడ ఉన్న డీఎండీకే పార్టీ కార్యకర్తలు షాక్ తిన్నారు.

కాగా గతంలోనూ విజయ్ కాంత్ ఇలా సొంత పార్టీ నేతల చెంప పగలగొట్టిన సందర్భాలున్నాయి. క్రిష్ణగిరి జిల్లాలో శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రచారం చేస్తూ బహిరంగ సభలోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న డీఎండీకే పార్టీ నాయకుడి చెంప పగలగొట్టారు. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో విజయ్ కాంత్ సొంత పార్టీ నాయకులను కొట్టిన సందర్భాలున్నాయి. పార్టీ గంగలో కలిసిపోయినా కెప్టెన్ బలుపు మాత్రం తగ్గలేదని తమిళనాడులో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/