Begin typing your search above and press return to search.

రోడ్డు మీదనే భార్యతో లంచ్ చేసిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   10 Jan 2017 11:12 AM IST
రోడ్డు మీదనే భార్యతో లంచ్ చేసిన స్టార్ హీరో
X
పేరు ప్రఖ్యాతులు దండిగా ఉన్నా.. కొందరు ప్రముఖులు చేసే పనులు వారి మీద ఉన్నదురభిప్రాయాలన్నింటిని పోయేలా చేయటమే కాదు..మరింత అభిమానాన్ని పెంచేలా చేస్తుంది. ఒక స్టార్ హీరో కమ్ ప్రముఖ రాజకీయ అధినేత అయి ఉండి.. చాలా సింపుల్ గా ఉన్నవైనం ఒక ఊరి ప్రజలనే షాకిచ్చేలా చేయటమే కాదు.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. కోలీవుడ్ సీనియర్ నటుడు..డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఈరోడ్ జిల్లాలోని సెన్నిమలై దగ్గరి ఒక దేవాలయానికి వెళ్లారు.

తిరిగి వచ్చే సమయంలో మధ్యాహ్నం కావటం.. ఎండ మండిపోవటంతోంది. దీంతో.. భోజనం చేయటానికి దారి మధ్యన ఒక ఊరిలో కారును ఆపారు. ఒక పెంకుటింటి ముందు విశాలంగా ప్లేస్ ఉండటంతో కారు నిలిపారు. తలకు తువ్వాలు కట్టుకున్న విజయ్ కాంత్.. కారు మీద అరటాకుపెట్టుకొని.. భోజనం చేస్తున్నారు. ఆయనకు కెప్టెన్ సతీమణి ప్రేమలత వడ్డిస్తున్నారు. మాంచి ఆకలి మీద ఉన్నారేమో కానీ..విజయ్ కాంత్ భోజనం చేస్తున్నారు.

అదే సమయంలో పొలం నుంచి వచ్చిన ఇంటి యజమాని.. తన ఇంటి ముందు కారు ఆపి.. రోడ్డు మీద భోజనం చేస్తున్నారేంటి? అంటూ కసురుకున్నాడు. దగ్గరకు వచ్చి.. భోజనం చేస్తున్నది ఎవరో గుర్తించిన ఆయన విపరీతంగా ఫీల్ కావటమే కాదు.. షాక్ తిన్నారు. వెంటనే తేరుకున్న ఆయన.. ఇంట్లోకి ఆహ్వానించటమే కాదు..స్వీట్లు..మరిన్ని వంటకాలు తీసుకొచ్చి వడ్డించారు.

ఆ అభిమాని అభిమానానికి పాజిటివ్ గా రియాక్ట్ అయిన విజయ్ కాంత్ వాటిని కూడా తినటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తన గ్రామంలోని ఒక ఇంటి ముందున్న రోడ్డు మీద విజయ్ కాంత్ భోజనం చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న ఆ ఊరు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోసాగారు. అప్పటికే భోజనాన్ని పూర్తి చేసిన కెప్టెన్.. ఊరి ప్రజలంతా అక్కడికి చేరుకునే దానికి ముందే వెళ్లిపోయారు. కెప్టెన్ తీరుకు ఆ ఊరు మొత్తం షాక్ తింది. ఈ విషయం గురించి.. ఆ చుట్టుపక్కల గ్రామాల వారు ఆసక్తిగా చెప్పుకోవటమే కాదు.. కెప్టెన్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/