Begin typing your search above and press return to search.
అమ్మ కూడా కూరలో కరివేపాకేనా జగన్?
By: Tupaki Desk | 5 Aug 2015 4:25 AM GMTతెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధినేత వైఖరిపై రానన్ని ఆసక్తికర కథనాలు.. వాదనలు ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మీద తరచూ వినిపిస్తుంటాయి. ఆయన మాటలు.. చేష్టలు కాస్తంత భిన్నంగా ఉండి రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ చర్చను రేపుతుంటాయి. జగన్ నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఎవరిని అట్టే కాలం నమ్మకపోవటం.. సీజన్ల మాదిరి ఒకరి తర్వాత ఒకరుగా మార్చేస్తుంటారన్న భావన వ్యక్తమవుతుంటుంది. ఈ వైఖరి బయట వారి విషయంలోనే కాదు.. ఇంట్లో వారి విషయంలోనూ ఇలాంటి వైఖరే ఉంటుందని చెబుతారు. జగనన్న విడిచిన బాణాన్ని అంటూ జగన్ జైల్లో ఉన్నప్పుడు యమా యాక్టివ్ గా చెలరేగిపోయిన షర్మిలమ్మ.. అప్పుడప్పుడు తెలంగాణలో పరామర్శలు చేసి..తన పని తాను అన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే.
ఫైర్ బ్రాండ్ మాదిరి దూసుకుపోయే వైఖరి ఉన్నా.. షర్మిలమ్మ తన పాత్రను పరిమితంగా పోషిస్తారే కానీ.. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయని పరిస్థితి. అదేమంటే.. సూటిగా సమాధానాలు చెప్పలేని షర్మిలమ్మ కాస్త ఇబ్బందికి గురి అవుతుంటారని చెబుతుంటారు. ఒక్క చెల్లి విషయంలోనే కాదు.. తల్లి విషయంలోనూ జగన్ తీరు ఇదే తరహాలో ఉండటం గమనార్హం.
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాస్తులు భారీగా సంపాదించారంటూ నమోదైన కేసులకు సంబంధించి దీర్ఘకాలం పాటు జైల్లో ఉన్న సమయంలో పార్టీ బండి నడిపించి విజయమ్మే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇష్టం లేకున్నా.. కొడుకు కోసం.. ఫ్యామిలీ కోసం ఆమె కష్టపడుతున్నట్లుగా చెబుతుంటారు. రాజకీయాలంటే ఏ మాత్రం ఇష్టం లేని విజయమ్మ.. తన భర్త దుర్మరణం తర్వాత.. అప్పటివరకూ తన భర్త వల్ల ప్రయోజనం పొందిన వారు చేస్తున్న పనులకు సమాధానం చెప్పాలనే దాని కన్నా.. అవసరానికి వాడుకొని వదిలేసిన వారి తీరుతో మనసు కష్టపెట్టుకొని రాజకీయాలంటే మరింత ఏహ్య భావంతో ఉన్నారని చెబుతారు.
ఏమైందో ఏమో తెలీదు కానీ.. గత కొద్దిరోజులుగా పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న విజయమ్మ బయటకు రాని పరిస్థితి. నోటి వెంట మాట కూడా రాని దుస్థితి. తాను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అత్యంత వూహాత్మకంగా తన బాణాన్ని పక్కన పెట్టేసిన జగన్.. ఆ తర్వాత తల్లిని కూడా పక్కన పెట్టేయటం చూసినప్పుడు.. జగన్ కు ఎవరైనా ఒకటేనా? అన్న సందేహాలు కలగటం ఖాయం.
జగన్ పై వస్తున్న ఈ తరహా విమర్శల్ని ఆయనకు సన్నిహితంగా ఉండే వారు మాత్రం ఖండిస్తు కనిపిస్తుంటారు. విజయమ్మ ఆరోగ్యం సరిగా లేదని.. రాజకీయాల పట్ల అనాసక్తిగా ఉన్నారని అందుకే బయటకు రావటం లేదన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. ఈ వాదనకు భిన్నంగా.. మిగిలిన వారి మాదిరే కూరలో కరివేపాకులా తల్లి విషయంలో వ్యవహరించటం జగన్ కు మాత్రమే సాధ్యమైందని విమర్శించే వారి సంఖ్య కాస్తంత ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంతకీ.. విజయమ్మను జగన్ కూరలో కరివేపాకు మాదిరే చూస్తున్నారా..?