Begin typing your search above and press return to search.

విజయమ్మ, షర్మిలకి కోర్టులో ఊరట..అసలు సంగతేమిటంటే

By:  Tupaki Desk   |   30 Sep 2021 12:30 PM GMT
విజయమ్మ,  షర్మిలకి కోర్టులో ఊరట..అసలు సంగతేమిటంటే
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్. విజయమ్మ, షర్మిలకి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. వీరిపై ఉండే కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల కార్యక్రమం నిర్వహించారని వీరిపై కేసు ఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లోనే పరకాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 2012లో జగన్‌ కు మద్దతుగా కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.

దీంతో పరకాలలో ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఆ సమయంలో తెలంగాణలోని పరకాల నుంచి కొండా సురేఖ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఈ సమయంలోనే విజయమ్మ, షర్మిల పరకాలకు ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఆ ఎన్నికల్లో సురేఖ, టీఆర్ఎస్ అభ్యర్ధి బిక్ష్మయ్య మధ్య హోరా హోరీ పోటీ సాగింది. అయితే, కొద్ది రోజుల క్రితం ఈ కేసులో కోర్టు వైఎస్ విజయమ్మకు, షర్మిలకు సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ అయ్యాయి.

వైసీపీ అభ్యర్ధులకు మద్దతుగా విజయమ్మ..షర్మిళ ప్రచారం చేసారు. అప్పుడు పరకాల నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కొండా సురేఖ టీఆర్ యస్ అభ్యర్ధి భిక్ష్మయ్య మధ్య చివరి దాకా నువ్వే నేనా అన్నట్లుగా పోటీ సాగింది. ఆ ఉప ఎన్నికలో టీఆర్ యస్ అభ్యర్ధి 1562 ఓట్ల తేడాతో సురేఖను ఓడించారు. వైయస్ కుటుంబానికి వీర విధేయురాలిగా ఉన్న సురేఖ ఆ తరువాత దూరమయ్యారు.