Begin typing your search above and press return to search.
విజయమ్మ వాక్కు : తన అవసరం ఇంక జగన్ కు లేదనేగా
By: Tupaki Desk | 9 July 2022 5:08 AM GMTవైసీపీ ప్రారంభంలో విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి హోదాలో నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నాను అన్నారు. ఆ రోజు సభలో ఉద్వేగంగా మాట్లాడారు. ఇడుపుల పాయ సాక్షిగా అనౌన్స్ చేసిన పార్టీ కనుక ఆమె మరింత ఉద్వేగంగా మాట్లాడారు. పదమూడేళ్ల కిందట ఈ మాట చెప్పాక ప్రజలు కూడా భావోద్వేగం చెందారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం కారణంగా రాష్ట్రంలోఅప్పుడున్న ఛిన్నాభిన్నం అయిన పరిస్థితుల రీత్యా అస్తవ్యస్త వాతావరణం ఒకటి నెలకొని ఉంది. ఇదే సమయంలో ప్రత్యర్థి శక్తులు అన్నీ ఏకం అయి తమ ఇంటి పై దాడి చేస్తున్నాయని కూడా విజయమ్మ మరియు జగన్మోహన్ రెడ్డి చెబుతూనే వచ్చారు. ఆ విధంగా ప్రజా మద్దతు పొందారు.
తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగేందుకు నాటి ఉప ఎన్నికలే ప్రామాణికం అయ్యాయి. తరువాత పార్టీ అనేక మార్పులకు నోచుకుంది. విభజన తరువాత రాజకీయం పూర్తిగా విజయవాడ కేంద్రంగా జరుగుతోంది. అయితే జగన్ కానీ మిగతా నాయకులు కానీ ఇవాళ్టికీ హైద్రాబాద్ తో సంబంధ బాంధ్యవాలు కొనసాగించడం ఆపలేదు. అదేవిధంగా జగన్ను కొందరు టీఆర్ఎస్ నాయకులు కూడా కొన్ని అనరాని మాటలే అన్నారు.
అవన్నీ రాజకీయంలో భాగంగా విని సర్దుకుపోయారు. తరువాత కొందరు వైఎస్సార్ మంత్రులు కూడా ఆయన్ను అనరాని మాటలే అన్నారు అవి కూడా విని సర్దుకుపోయారు. వీలున్నంత వరకూ జగన్ వాగ్ధాటితో ప్రత్యర్థిని నిలువరించిన దాఖలాలు లేవు కానీ ప్రజా మద్దతును సేకరిచండంలో మాత్రం ఆత్మ గౌరవ నినాదాన్ని అందుకున్నారు.
అదే తారక మంత్రం అయింది. ఎన్టీఆర్ మాదిరిగానే ఆయన కూడా ఆత్మగౌరవ నినాదం అందుకున్నారు. ఎన్టీఆర్ జీవన సహచరి లక్ష్మీ పార్వతి కూడా టీడీపీని కార్నర్ చేసి మాట్లాడేరు. అవన్నీ కూడా జగన్ కు ప్లస్ అయ్యాయి. నిన్న కూడా అల్లుడిని టార్గెట్ చేశారు ఎల్పీ. ఏ విధంగా చూసుకున్నా జగన్ ను తిరుగులేని నేతగా చేసింది ఓ విధంగా సానుభూతి రాజకీయమే!
విశాఖలో విజయమ్మ ఓడిపోయినా మిగిలిన చోట్ల పార్టీ గెలుపునకు ఆమె ఎంతో కృషి చేశారు. ఆమె ప్రభావం లేకుండా వైసీపీ రాజకీయం లేదు. ఆ ప్రభావం నుంచి వైసీపీ తప్పించుకునే వీలే లేదు.
ఇప్పుడు మారుతున్న పరిణామాల కారణంగా ఆమె పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెళ్తున్నారు.మళ్లీ నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి వెళ్తున్నారు.. ఈ సారి ఈ మాట ఏ మేరకు ప్రభావితం చేయనుందో అన్నది ఓ ఆసక్తిదాయక పరిణామం. పార్టీ భవిష్యత్ కు ఇదే ఓ కీలక పరిణామం.