Begin typing your search above and press return to search.
విజయమ్మ ఆత్మీయ భేటీ అజెండా ఏమిటి?
By: Tupaki Desk | 1 Sep 2021 9:31 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిన విజయమ్మ నిర్వహిస్తున్న వైఎస్ ఆత్మీయ భేటీ అజెండా ఏమిటి? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎవరికి వారు ఈ చిక్కుముడిని తీయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఒక ముడి తీసినంతనే మరో ముడి పడుతున్నట్లు చెబుతున్నారు. తన భర్త మరణించిన పదకొండేళ్ల తర్వాత.. పన్నెండో వర్థంతి వేళ.. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఈ సమావేశం ఎజెండా ఏమిటన్నది చూస్తే.. పైకి ఏమీ లేదని.. రాజకీయ పార్టీ మీటింగ్ కాదనేస్తున్నప్పటికీ.. ఒకప్పుడు వైఎస్ కారణంగా మేలు పొందిన వారంతా ఈ మీటింగ్ కు వస్తారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికికారణం రాజకీయ ఎత్తులేనని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ.. జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు పలువురు గతంలో వైఎస్ కు వీరాభిమానులుగా వ్యవహరిస్తున్న వారు ఈ సమావేశానికి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఆత్మీయ సమావేశాన్ని వైఎస్ వర్థంతి నాడే నిర్వహిస్తున్నప్పుడు.. అదేదో కడప జిల్లా ఇడుపులపాయలో నిర్వహించకుండా హైదరాబాద్ లో ఎందుకు నిర్వహిస్తున్నట్లు? అన్నది ఒక ప్రశ్నగా మారింది. అయితే.. దీనికి కొందరు చెబుతున్న కారణాలు వేర్వేరుగా ఉన్నాయి.
ఇడుపుల పాయలో రవాణా సౌకర్యాల సమస్య ఎదురవుతుందని.. ఇప్పుడున్న కరోనా వేళలో.. అంత దూరం పిలిపించటంఎవరికి మంచిది కాదన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు చెబుతారు. అయితే.. హైదరాబాద్ లో నిర్వహించటం ద్వారా తన రాజకీయ ఎత్తుగడను విజమయ్మ వేశారని.. తన కుమార్తె రాజకీయ భవిత కోసం ఈ మీటింగ్ పెట్టారన్న మాటను చెబుతున్నారు. మరోవైపు.. అలాంటిదేమీ లేదని.. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించటం ద్వారా తన ఇద్దరు పిల్లల రాజకీయ భవిష్యత్తు ఏ రీతిలో ఉండనుంది? వారిపై ఉన్న పాజిటివ్.. నెగిటివ్ అంశాలు ఏమిటి? రెండు ప్రభుత్వాలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న ఫీడ్ బ్యాక్ ను తీసుకునే వీలుందంటున్నారు. ఏది ఏమైనా.. ఎజెండా అన్న దానిపై వ్యూహాత్మకంగా వ్యవమరిస్తూనే ఆత్మీయ భేటీని నిర్వహిస్తున్నారని.. దీనికి ఇప్పటివరకు 300 మంది వరకు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మరి.. వీరిలో ఎంతమంది హాజరవుతారు? ఎంతమంది డుమ్మా కొడతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన పక్కా సమాచారం అందాలంటే మరో రోజు ఆగక తప్పదు.