Begin typing your search above and press return to search.
అధికార వైఎస్సార్సీపీలో కాక పుట్టిస్తున్న విజయనగరం!
By: Tupaki Desk | 2 Aug 2022 11:30 PM GMTఅధికార వైఎస్సార్సీపీలో విజయనగరం కాక పుట్టిస్తోందా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ 2019 ఎన్నికల్లో వైశ్య సామాజికవర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుపై దాదాపు 6,400 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అంతకుముందు 2004లోనూ కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. అలాగే 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి కోలగట్ల ఓడిపోయారు. మొత్తం నాలుగుసార్లు పోటీ చేస్తే 2004, 2019ల్లో విజయం సాధించారు.
కాగా బీసీలు అత్యధికంగా ఉన్న విజయనగరం నియోజకవర్గంలో ఓసీ అభ్యర్థికి సీటెలా ఇస్తారని బీసీ నేతలు వైఎస్సార్సీపీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారంట. ముఖ్యంగా విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న బొత్స సత్యనారాయణ అనుచరులు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్ తదితరులు ఎమ్మెల్యే కోలగట్లకు చుక్కలు చూపిస్తున్నారని చెబుతున్నారు.
కోలగట్ల వీరభద్రస్వామి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీలతో సఖ్యతగా వ్యవహరించడం లేదని బీసీ నేతల అభియోగంగా ఉందని చెబుతున్నారు. 2024లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే విజయనగరంపై వైఎస్సార్సీపీ ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చిచెబుతున్నారట.
అయితే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నుంచి మరోమారు తానే పోటీ చేస్తానని తేల్చిచెబుతున్నారంట. తాను పోటీ చేయకపోతే తన కుమార్తె కోలగట్ల శ్రావణి పోటీ చేస్తుందని వీరభద్రస్వామి ఇప్పటికే అందరికీ చెప్పేశారని సమాచారం. ఇటీవల ఒక పార్టీ కార్యక్రమంలో సాక్షాత్తూ మంత్రి బొత్స సమక్షంలోనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోలగట్ల కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని ప్రచారం జరుగుతోంది. తద్వారా తన వ్యతిరేకులకు, అలాగే వారికి మద్దతుగా నిలుస్తున్న బొత్స సత్యనారాయణకు పరోక్షంగా ఎమ్మెల్యే కోలగట్ల వార్నింగ్ ఇచ్చేసినట్టేనని చెప్పుకుంటున్నారు.
కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజు పార్లమెంటుకు పోటీ చేస్తే ఆయన కుమార్తె అదితి గజపతిరాజు అసెంబ్లీ బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.