Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా ఫేక్ గ్యాంగ్ తో పాటు వారికీ విజయసాయిరెడ్డి హెచ్చరిక
By: Tupaki Desk | 10 May 2020 3:22 PM GMTవైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ఫేక్ గ్యాంగ్ లకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, ఫేక్ అకౌంట్స్ తో తనపై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ రోజు (ఏప్రిల్ 10) ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్ట, గౌరవానికి భంగం కలిగించేలా కొంతమంది తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ సృష్టించి - అసత్యాలు ప్రచారం చేస్తున్నారని - అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని - వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ సృష్టించిన గ్యాంగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశానని - వారు విచారణ మొదలు పెట్టారని చెప్పారు. సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరు తప్పించుకోలేరన్నారు. ఫేక్ అకౌంట్ లో ఫేక్ గ్యాంగ్ పోస్టులు పెడుతోందని - అవి నేరమని - దాంతో పాటు ఈ ఫేక్ గ్యాంగ్ పోస్ట్ లను షేర్ చేసేవాళ్లు కూడా సైబర్ క్రైమ్ చట్టం కింద శిక్షార్హులే అవుతారన్నారు.
ఫేక్ గ్యాంగ్ ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా పోలీసులకు చిక్కకడం ఖాయమన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు - ప్రచారాలు చేసే వారితో పాటు వాటిని అత్యుత్సాహంతో షేర్ చేసేవారు కూడా శిక్షార్హులు అవుతారని - పోలీసులు వారిని కూడా పట్టుకుంటారని చెప్పారు. ఇలాంటి ఫేక్ ప్రచారం పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.