Begin typing your search above and press return to search.
విజ్ఞప్తి చేస్తూనే..బాబును వాయించేసిన విజయసాయిరెడ్డి
By: Tupaki Desk | 23 Nov 2018 7:43 AM GMTవైసీపీ తరఫున గళం వినిపిస్తూ సునిశితమైన విమర్శలు చేయడం - ప్రధానంగా అధికార టీడీపీని టార్గెట్ చేయడంలో ముందుండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి - రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన దూకుడును అదే రీతిలో కొనసాగిస్తున్నారు. వివిధ అంశాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా - ఆయన పరిపాలనను వ్యవస్థీకృతంగా విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు రాజకీయ - పార్టీ పరమైన నిర్ణయాలను పలు ట్వీట్లలో విశ్లేషించారు. వివిధ రకాలైన ప్రతిపాదనలు - సెటైర్లు - విమర్శలతో వరుసగా విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు.
కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న తీరును విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ``చంద్రబాబు కాంగ్రెస్ కు సరెండర్ అయిపోయి - రాహుల్ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ ‘యూ-టర్న్ అంకుల్’ మరో చారిత్రక ‘యూ టర్న్’కు సిద్ధపడిపోతున్నాడు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీలోనే తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.`` అంటూ సంచలన ట్వీట్ చేశారు. అదే సమయంలో బాబు జాతీయ పార్టీల దోస్తీని సైతం విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ``దేశాన్ని రక్షించాలి....ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఎవరంటున్నారు ఈ మాటలు? నాలుగున్నరేళ్ళలో ప్రజాధనాన్ని విచ్చల విడిగా దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి - ప్రజలను నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిన అరివీర సూడో మీడియా ప్రజాస్వామ్యవాది...చంద్రబాబే!``` అని వ్యాఖ్యానించారు. ``దొంగ హామీలు - నోరు విప్పితే అబద్దాలు...ఈ కళలో చంద్రబాబు మాస్టర్. 2014లో బాబు చేసిన దొంగ వాగ్దానాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు నమ్మారు. అలాగే 2019 ఎన్నికలలో బాబును బంగాళాఖాతంలో విసిరేయాలని కూడా ఒట్టేసుకున్నారు.`` అని ఆయన విరుచుకుపడ్డారు.
మరో ట్వీట్ లో ఏసీ సీఎం చంద్రబాబు ఆస్తుల ప్రకటనను విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ``చేతికి వాచీ - వేలికి ఉంగరం - జేబులో పర్సు కూడా లేని నిరాడంబరుడైన నాయుడు బాబు దేశంలోని సీఎంలు అందరిలోకి అత్యంత ధనవంతుడని - ఆయన ఆస్తుల విలువ 177 కోట్లని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటిస్తే దేశం యావత్తు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్న మాట మరిచావా చిట్టి నాయుడూ?`` అంటూ లోకేష్ - చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కీలక సూచన చేశారు. ``ఉన్నత స్థాయిలో ఉన్న ఏపీ సివిల్ సర్వెంట్స్ కు నాదో విజ్ణప్తి. చంద్రబాబు మానసిక స్థితి బాగా లేదు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి Yes అనకండి. మరో ఆరు నెలల్లో ఎలాగూ నిష్క్రమిస్తాడు. ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకోండి.`` అని సూచించారు.