Begin typing your search above and press return to search.
ఇది ఉల్లిపొర మాత్రమే అంటున్న విజయసాయి రెడ్డి!
By: Tupaki Desk | 14 Feb 2020 5:30 PM GMTతెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మీద మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వి.విజయసాయిరెడ్డి. చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లపై ఐటీ రైడ్స్ లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయనే వార్తల నేపథ్యం లో సాయిరెడ్డి స్పందించారు. రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు అనేవి చంద్రబాబు కు సంబంధించి నవే అన్నట్టు గా ఆయన ట్వీట్ చేశారు. అది కూడా ఇప్పుడు బయట పడింది కేవలం ఉల్లిపొర స్థాయి ఆస్తులే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు తరచూ తన గురించి తను చెప్పుకునే అంశాలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొరికిపోయాడంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ల వరస ఇలా ఉంది.
పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి. బాబు నెట్ వర్క్ ను చూసి ముంబాయి కార్పోరేట్ సంస్థలన్నీ బిత్తర పోయాయట. ఇప్పడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమే.
మహాత్మా గాంధీ లాంటివాడినని కటింగులిచ్చాడు. నిప్పు కణికలు నన్ను చూసి ఈర్షపడతాయని గొప్పలు పోయాడు. అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేసి 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు. వ్యవస్థలన్నిటిని మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు.
మొత్తానికి చంద్రబాబు నాయుడి పీఎస్ వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఉపయోగించుకుంటోంది. చంద్రబాబుపై ఫైర్ అవుతూ ఉంది. ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల స్థాయి అక్రమాస్తులు అనే అంశం ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.