Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి జోస్యం : విశాఖ హైదరాబాద్ ని దాటేస్తుందా...?

By:  Tupaki Desk   |   27 July 2022 3:22 PM GMT
విజయసాయిరెడ్డి జోస్యం : విశాఖ హైదరాబాద్ ని దాటేస్తుందా...?
X
ఏపీలోనే డెవలప్ అయిన సిటీగా విశాఖకు పేరుంది. విశాఖ ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉంది. అలాంటి విశాఖ ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత అన్న ట్యాగ్ తగిలించుకుని ఒక విధంగా క్రేజ్ ని సొంతం చేసుకుంది. విభజన ఏపీలో విశాఖ మీద ప్రభుత్వాలు ఫోకస్ ఎంత మేరకు పెట్టాయన్నది చూస్తే కొంత నిరాశ కనిపించినా విశాఖ తానుగానే సొంతంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆర్ధిన నిపుణుల మాట.

ఈ నేపధ్యంలో అలా చూస్తూ ఉండండి తమ ప్రభుత్వ ఏలుబడిలో విశాఖ బాగా డెవలప్ అయి హైదరాబాద్ ఏ బీటౌట్ చేసి దూసుకుపోతుంది అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. విశాఖను అలా ముందు వరసలో పెట్టేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని, ఆ దిశగా అనేక చర్యలను తీసుకుంటోందని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంకణం కట్టుకుంటే అనేక అవాంతరాలను టీడీపీ సృష్టిస్తోందని కూడా ఆయన ఆరోపించారు.

ఇక విశాఖను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే అజెండా తమ వద్ద ఉందని ఆయన అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ విశాఖకు మకాం మార్చి రాజధాని లుక్ ఇవ్వడానికి చూస్తున్నారు అన్న ప్రచారం ఉంది. ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డి అన్న మాటలను చూస్తే విశాఖ హైదరాబాద్ ని దాటి వెళ్ళడం పక్కన పెడితే వైసీపీ మరోమారు విశాఖను ముందు పెట్టి ఫోకస్డ్ పాలిటిక్స్ కి తెర బోతోంది అని అంటున్నారు.

ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల జీడీపీలను కూడా విశ్లేషించిన విజయసాయిరెడ్డి టీడీపీ ఏలుబడిలో విశాఖకు పట్టించుకుని ఉంటే దేశంలోనే టాప్ ఫైవ్ లో ఉండేదని అభిప్రాయపడ్డారు కానీ ఈ జీడీపీ వివరాలు ర్యాంకుల గురించి చూస్తే విశాఖ పదవ స్థానంలో ఉంది.

టీడీపీ ఏలుబడిలో తొమ్మిదవ ప్లేస్ లో ఉన్న విశాఖ ఇపుడు మరింతంగా వెనకబడింది కదా అని నెటిజన్లు విజయసాయిరెడ్డి కామెంట్స్ కి రీ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక విశాఖ హైదారాబాద్ ని అధిగమిస్తుంది అన్న దాని మీద చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ మంచి ఆర్ధిక రాజధాని అవడం మాత్రం ఖాయమని చెబుతున్నారు. అది కూడా ఇపుడప్పుడే కాదని, మరో పదేళ్ళ టైమ్ అయినా పడుతుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖను మేమే అభివృద్ధి చేయగలమని విజయసాయిరెడ్డి చెప్పుకుంటున్నా జీడీపీ చూసినా మరో విధంగా చూసినా వెనకబడే ఉంది అని కామెంట్స్ పడుతున్నాయి.