Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి పేపర్, టీవీ పేరు అదేనా...?

By:  Tupaki Desk   |   20 Oct 2022 11:30 AM GMT
విజయసాయిరెడ్డి పేపర్, టీవీ పేరు అదేనా...?
X
వైసీపీ ఎంపీ, సీనియర్ నేత వి విజయసాయిరెడ్డి తొందరలో మీడియా రంగంలోకి వస్తానని విశాఖలో ఈ మధ్యనే సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మీడియా మొఘల్ రామోజీరావుకు సవాల్ చేస్తూ నేనూ మీడియాలోకి వస్తున్నా చూసుకుందామని చెప్పుకొచ్చారు. దాంతో ఆయన ఆవేశంలో ఆ మాటలు అన్నారా లేక నిజంగానే మీడియా ఫీల్డ్ లోకి వస్తున్నారా అన్న చర్చ అయితే బయల్దేరింది.

అయితే తెరవెనక జరుగుతున్న కసరత్తు చూస్తే విజయసాయిరెడ్డి సరదాగా ఏమీ మాట్లాడలేదని, ఆయన సీరియస్ గానే ఈ విషయాలను మీడియాకు చెప్పారని అంటున్నారు. చాలా తొందరలోనే విజయసాయిరెడ్డి మార్క్ తో ఒక పత్రికతో పాటు చానల్ కూడా తెలుగు నాట వస్తాయని అంటున్నారు. దీని మీద ఇపుడు విజయసాయిరెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారనే అంటున్నారు.

అయితే విజయసాయిరెడ్డి పేపరు పెట్టడానికి కానీ చానల్ ఓపేన్ చేయడానికి కానీ ఎందుకు ఆరాటపడుతున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి వైసీపీఎకి సాక్షి రూపంలో బలమైన చానల్, ఒక పత్రిక ఉన్నాయి. అలాగే ఒకటి రెండు ఇతర చానళ్ళు కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో పోలిస్తే మాత్రం వైసీపీకి మీడియా సపోర్ట్ బాగా తక్కువ ఉంటే ఉండొచ్చు కానీ ఆ పార్టీ వాణిని బాణిని వినిపించడానికి మాత్రం ఉండాల్సిన స్కోప్ అయితే మీడియా ఫీల్డ్ లో ఈ రోజుకు ఉంది.

ఇక విజయసాయిరెడ్డి సాక్షి ఉండగా కొత్తగా మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. దీని మీద విశాఖ ప్రెస్ మీట్లోనే ఆయన జవాబు చెప్పారు. సాక్షి ఉంది కానీ ఇంకా గట్టిగా ప్రత్యర్ది పార్టీలను ఎదుర్కోవడానికే తాను మీడియా ఫీల్డ్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అంటే సాక్షి అంత బలంగా ఎదుర్కోలేకపోతోందా అన్నది కూడా ఇక్కడ ఏర్పడుతున్న డౌట్.

ఏది ఏమైనా విజయసాయిరెడ్డి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉంటూ ఆ మీదట రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. రెండు సార్లు ఎంపీగా ఉంటూ జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నారు. ఇపుడు ఆయన మరో కీలకమైన రంగంలోకి అడుగు పెడుతున్నారు. మీడియా పవర్ ఫుల్ వెపన్. పైగా తెలుగు నాట మీడియాకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో ఉంది. రాజకీయాలనే శాసించే స్థాయిలో తెలుగు మీడియా చేరుకుంటున్న దశలో ఒక రాజకీయ పార్టీ నేతగా ఉంటూ విజయసాయిరెడ్డి మీడియా వైపుగా వస్తున్నారు అంటే ఆయన టార్గెట్లు ఏమై ఉంటాయి అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇక కొసమెరుపు ఏంటి అంటే విజయసాయిరెడ్డి పెడుతున్న చానల్, పత్రికలకు నిజం అని పేరుని పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఇదే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసే పనిలో ఆయన ఉన్నారని అంటున్నారు. నిజం అన్న టైటిల్ లోనే పవర్ ఉంది. క్యాచీగా జనాల్లోకి వెళుతుంది అన్న భావన ఉంది. ప్రత్యేకించి తాము చెప్పేది నిజం అని పాజిటివ్ వైబ్రేషన్స్ జనాల నుంచి సాధించే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి కనుక మీడియా ఫీల్డ్ లోకి వస్తే వైసీపీకి అది అదనపు బలం అవుతుందా, లేక సాక్షితో పోటీగా మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.