Begin typing your search above and press return to search.
రఘురామరాజు చీటింగ్ కేసుపై సీబీఐకి మరోసారి విజయసాయి ఫిర్యాదు
By: Tupaki Desk | 24 March 2022 1:30 PM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఒంటికాలిపై లేస్తూ జగన్ సర్కార్ పై విమర్శల వాన కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కల్తీ మద్యం విక్రయాలు సహా పలు అంశాలపై జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ఈ తరుణంలో వైసీపీ అధిష్టానం రఘురామను ఎంపీ పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
గురువారం వైఎస్‌ఆర్‌సి ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి.. రఘురామరాజు కంపెనీకి చేసిన బ్యాంకు మోసం కేసుపై దర్యాప్తును వేగవంతం చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసి ఈ అంశంపై చర్చించారు.
అసలు మోసగాళ్ల ముసుగును బట్టబయలు చేసేందుకు కార్పొరేట్ ముసుగు ఎత్తివేసేందుకు సీబీఐ విచారణను వేగవంతం చేయాలని సాయిరెడ్డి సీబీఐకి రాసిన లేఖలో అభ్యర్థించారు. రఘు రామకృష్ణరాజుతో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల డైరెక్టర్లు.. ఇతర సంబంధిత వ్యక్తులపై కోర్టు ప్రయాణ నిషేధం విధించాలని కూడా ఆయన కోరారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు.. వాటి డైరెక్టర్లను వ్యక్తిగతంగా బాధ్యులుగా చేయడం ద్వారా వారి నుండి వడ్డీతో సహా వసూలు చేయాలని.. మోసం మొత్తాన్ని రికవరీ చేయడానికి సీబీఐ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. “రఘు రామకృష్ణరాజు స్థాపించిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ చేసిన భారీ మోసం వెనుక ఉన్న నిజమైన దోషులను చట్టప్రకారం శిక్షించాలని.. వడ్డీతో సహా రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా సత్వర చర్యలు తీసుకోవాలని విజయసాయి కోరారు.
ఐబీటీపీఎల్‌కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం రూ. 1004.6 కోట్ల మేరకు వివిధ రుణ సదుపాయాలను మంజూరు చేసిందని.. కర్నాటకలోని హొంకన్ విలేజ్‌లో 300 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత తమిళనాడులోనూ మోసం చేశారని విజయసాయి ఆరోపించారు.
నిర్ణీత సమయంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) అనేక సందర్భాల్లో ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించాయి. ఈ కేసు నెమ్మదిగా పురోగమించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 2016లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 1021.13 కోట్లు రుణాలు తీసుకొని మోసం చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
31 ఆగస్టు 2019 నాటి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా.. 1 ఏప్రిల్ 2014 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య నిధుల మళ్లింపు చేసినట్టు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (లీడ్ బ్యాంక్) 14.11.2019న ఖాతా 'మోసం'గా ప్రకటించింది. ఈ డబ్బును స్వాహా చేసినట్లు న్యూఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ఫిర్యాదు చేయడంతో రుణదాతల కన్సార్టియంలోని అన్ని ఇతర 9 బ్యాంకులు కూడా మోసాన్ని ప్రకటించాయి.
సీబీఐకి ఫిర్యాదు చేశాయి. “ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని సీబీఐ విచారించాలని విజయసాయిరెడ్డి కోరారు. కేసును పరిష్కరించడంలో జాప్యం కారణంగా దాని ప్రమోటర్లు విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును కార్లు ఇళ్లపై విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సీబీఐ ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.