Begin typing your search above and press return to search.

విజ‌య‌సాయిరెడ్డి ఆర్థిక‌శాఖా మంత్రా...!

By:  Tupaki Desk   |   31 Jan 2022 10:57 AM GMT
విజ‌య‌సాయిరెడ్డి ఆర్థిక‌శాఖా మంత్రా...!
X
ఏపీలో అధికార వైసీపీలో ఇప్పుడు ప‌ద‌వుల టెన్ష‌న్ నెల‌కొంది. త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఖాళీ అయ్యే నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు కూడా అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఈ నాలుగు స్థానాల కోసం పార్టీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి ప‌ద‌వి రెన్యువ‌ల్ అవుతుందా ? లేదా ? అన్న‌ది కూడా కాస్త స‌స్పెన్స్‌గా ఉంది. ఇందుకు పార్టీ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఒక‌వేళ విజ‌య‌సాయిరెడ్డికి ఎంపీ రాజ్య‌స‌భ ఎక్స్‌టెన్ష‌న్ లేక‌పోతే ఆయ‌న్ను జ‌గ‌న్ త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ మార్పుల్లో మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవ‌డంతో పాటు ఖ‌చ్చితంగా ఆర్థిక‌మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అంటున్నారు.

విజ‌య‌సాయి రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ చేయ‌క‌పోతే త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆర్థిక‌శాఖా మంత్రి ప‌ద‌వి ఇచ్చే ఛాన్సులు ఉన్నాయ‌ని వైసీపీ వ‌ర్గాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీని ఆర్థికంగా అన్ని విధాలా ముందుకు న‌డిపించాలంటే ఆర్థిక‌వేత్త అయిన ఆయ‌నే స‌మ‌ర్థుడు అని కూడా జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌సాయికి ఆర్థిక వ్య‌వ‌హారాల్లో మంచి ప‌ట్టు ఉంది. జ‌గ‌న్ పార్టీ పెట్ట‌క‌ముందు నుంచే వైఎస్ ఫ్యామిలీ, జ‌గ‌న్ ఆర్థిక వ్య‌వ‌హారాలు అన్నింటిని ఆయ‌నే చూసుకునేవారు.

ఇక జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ఆయ‌న రాజ‌కీయంగా కూడా ఆరితేరిపోయారు. ఇక ఢిల్లీలో కూడా ఆయ‌న‌కు మంచి ప‌లుకుబ‌డి ఉంది. ఎన్డీయే పెద్ద‌ల‌తో పాటు కేంద్ర మంత్రుల‌తో కూడా ఆరేళ్లుగా ఎంతో స‌న్నిహితంగా ఉంటున్నారు. ఇక సీఎం జ‌గ‌న్‌కు కావాల్సిన వ్య‌క్తి. బీజేపీ ప్ర‌భుత్వం నుంచి ఫండింగ్ తీసుకురావ‌డంలో ఆయ‌న వ్యూహాలు ప‌నిచేస్తాయ‌ని జ‌గ‌న్ న‌మ్ముతున్నారు.

రాష్ట్రం తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబ‌ట్టే విష‌యంలో అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌న్న భావ‌న‌కు జ‌గ‌న్ వ‌చ్చేశార‌ట‌. అందుకే మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పుల్లో బుగ్గ‌న‌ను ప‌క్క‌న పెట్టేస్తార‌నే అంటున్నారు. అదే జ‌రిగితే ఈ సారి బుగ్గ‌న ప్లేస్‌లో విజ‌య‌సాయిని ఆర్థిక‌మంత్రిగా చూడొచ్చన్న టాక్ వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.