Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలోకి రాములమ్మ?
By: Tupaki Desk | 4 Aug 2019 4:27 AM GMTతెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా ఆ పార్టీ నేతలు గుడ్ బై చెప్తుండగా...ఈ జాబితాలో సినీ నటీ - కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటు సినీమాలు అటు రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న రాములమ్మ పాలిటిక్స్ లో కాంగ్రెస్ లో తన పాత్రపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతల తీరు నచ్చని విజయశాంతి బీజేపీలోకి వెళ్లాలన్న నిర్ణయంలో రాములమ్మ ఉన్నట్లు సమాచారం.
వివిధ సందర్భాల్లో టి కాంగ్రెస్ పై విజయశాంతి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి సోనియాగాంధీ - రాహుల్ గాంధీలు వచ్చిన సమయంలో ఏకంగా టీపీసీసీ నేతలపై ఫైర్ అయ్యారు. ఇరువురు నేతలకు స్వాగతం పలుకుతూ టీపీసీసీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో టీపీసీసీ సీనియర్ నేతల ఫొటోలను మాత్రమే ఉంచారని - ఒక్క మహిళా నాయకురాలి ఫొటోను కూడా లేదనీ మండిపడ్డారు. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ ఎస్ పై మనం విమర్శలు గుప్పిస్తున్నామని... మన పోస్టర్ లో ఒక్క మహిళ ఫొటో కూడా లేకపోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు. ఈ సభలో కేవలం మగవాళ్లు మాత్రమే కాకుండా - మహిళలు కూడా పాల్గొంటారు కదా అని కాంగ్రెస్ పార్టీ పెద్దలపై రాములమ్మ మండిపడ్డారు.
ఇలా తనకు దక్కుతున్న ప్రాధాన్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయశాంతి తనదారి తాను చూసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఆమె.. త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు బీజేపీ సరైన వేదికగా విజయశాంతి భావిస్తున్నారు. విజయశాంతి తన రాజకీయ ప్రస్థానాన్ని బీజేపీలోనే ప్రారంభించారు. విజయశాంతి అసంతృప్తి - తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలన్న అమిత్ షా నిర్ణయంతో.. బీజేపీ నాయకులు ఆమెతో రెండు సార్లు సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది. ఆ పరిచయాలతోనే త్వరలోనే విజయశాంతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు - కేంద్రమంత్రి అమిత్ షాను కలవనున్నారని తెలుస్తోంది. రాములమ్మ పార్టీ మారడంపై స్పష్టత రావాలంటే...మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.