Begin typing your search above and press return to search.
'దిశ' నింధితుల ఎన్ కౌంటర్ పై ప్రభుత్వానికి విజయశాంతి విజ్ఞప్తి ..!
By: Tupaki Desk | 7 Dec 2019 7:59 AM GMTదిశ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో, దిశ నిందితుల ఎన్ కౌంటర్ అంతకు రెట్టింపు సంచలనం రేపింది. ఈ ఘటనపై ఎవరికి వారు తమ శైలిలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మొత్తంగా ఎక్కువ మంది పోలీసులపై ప్రశంసలు కురిపిస్తుంటే .. మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్ కౌంటర్ పై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు.
ఈ ఘోర నేరానికి పాల్పడిన నలుగురికి తగిన శిక్ష పడిందని, ఆ నలుగురు మానవత్వాన్ని మంట గలిపారని, అలాంటి వాళ్ల విషయంలో మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని అన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, నేరస్తులను శిక్షించడం కరెక్ట్ అని చెప్పిన విజయశాంతి , ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటం కోసం ముందుగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మున్ముందు ఇలాంటి ఎన్ కౌంటర్లు అవసరంలేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళలు నిర్భీతిగా సంచరించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే దిశ కి త్వరగా నాయ్యం జరిగేలా చూసిన పోలీసులకి , ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.