Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ గా ఆ ఇద్దరు టీ కాంగ్రెస్ నేతల క్రేజ్!
By: Tupaki Desk | 21 Oct 2018 5:00 AM GMTతొడ కొట్టి మరీ.. కేసీఆర్ సంగతి చూస్తానని.. అంతకంతకూ లెక్క తేలుస్తానంటూ గాండ్రించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ ను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రేజ్ పీక్స్ లో ఉన్న వేళలో... ఆయన్ను పల్లెత్తు మాట అనేందుకు సైతం వెనుకా ముందు ఆడే వేళలో.. ఆయనపై ఒక రేంజ్లో విరుచుకుపడిన ఫైర్ బ్రాండ్ గా రేవంత్ కు తెలంగాణ వ్యాప్తంగా క్రేజ్ ఉందన్న విషయం తాజాగా రాహుల్ పర్యటన పుణ్యమా అని మరోసారి బయటకు వచ్చింది.
నిత్యం రాజకీయాల్లో ఉండే రేవంత్ కున్న క్రేజ్ ఒక ఎత్తు అయితే.. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ రాజకీయాల ముఖం చూడని సినీ నటి కమ్ రాజకీయ నేత విజయశాంతికి కాంగ్రెస్ నేతల్లో ఉన్న క్రేజ్ ఎంతన్నది తాజాగా రాహుల్ పర్యటన సందర్భంగా వెల్లడైంది. రోజు వ్యవధిలో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్న రాహుల్ తో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇద్దరు నేతలు. వారిలో ఒకరు రేవంత్ అయితే.. మరొకరు విజయశాంతి.
భైంసా సభలో రేవంత్.. విజయశాంతిలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలవటమే కాదు.. వారిద్దరిని చూసేందుకు ప్రజలు చూపించిన ఆసక్తి ప్రత్యేకంగా కనిపించింది. ముఖ్యంగా భైంసా సభలో విజయశాంతిని చూసేందుకు జనాలు తోసుకురావటమే కాదు..ఆమెతో ఫోటోలు.. సెల్ఫీలు దిగేందుకు చూపించిన ఆసక్తి అంతా ఇంతా కాదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సాధారణ ప్రజల్లో ఫైర్ బ్రాండ్ నేతల్లో ఆసక్తి ఉండటం మామూలే. కానీ.. ఈ ఇద్దరితో ఫోటోలకు.. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వీఐపీ గ్యాలరీలో ఉన్న ప్రముఖులు సైతం ఉత్సుకత ప్రదర్శించటం అందరి దృష్టిని ఆకర్షించింది. రేవంత్.. విజయశాంతిలతో ఫోటోలకు.. షేక్ హ్యాండ్ లకు సభికులల్లో వెల్లివిరిసిన ఉత్సాహం ఒక రేంజ్లో ఉన్నట్లుగా చెబుతున్నారు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేవంత్ ప్రసంగం కోసం సభలకు వచ్చిన వారు ప్రత్యేకంగా నినాదాలు చేయటం గమనార్హం.