Begin typing your search above and press return to search.
ఆర్కేనగర్ లో ప్రత్యక్షమైన రాములమ్మ
By: Tupaki Desk | 8 April 2017 6:12 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం పేరిట హడావుడి చేసిన విజయశాంతి ఇప్పుడు తమిళనాడు మీద ఫోకస్ చేసింది. సొంతంగా పార్టీ పెట్టటటమే కాదు.. తర్వాతి దశలో పలు పార్టీల్లో చేరి.. రాజకీయంగా ఏదేదో చేస్తానని చెప్పిన ఆమె.. ఆ తర్వాత ఎందుకు కామ్ అయ్యారో మాత్రం చెప్పలేదు. మీడియావాళ్లు కలిసినప్పుడు మీ మౌనానికికారణం ఏమిటన్న ప్రశ్నను సంధిస్తే.. టైం వచ్చినప్పుడు అన్ని చెబుతానంటారే కానీ.. అసలు విషయాన్నిమాత్రం చెప్పారు.
తన తీరుతో ఎప్పటికప్పుడు క్వశ్చన్ మార్క్ లా కనిపించే విజయశాంతి తెలుగు ప్రజల కోసం చేస్తానన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడామె తమిళుల మనసుల్ని దోచుకునే పని షురూ చేశారు. అమ్మ మరణంలో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారబరిలోకి దిగారు. అన్నాడీఎంకే శశికళ తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ తరఫున ఆమె ప్రచారం చేస్తున్నారు. ఆయనెవరో కాదు.. చిన్నమ్మ శశికళ అక్క కొడుకన్న విషయం తెలిసిందే.
హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన కాలంలో.. తెలుగు.. తమిళ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేసిన విజయశాంతి.. పాత పరిచయంతో చిన్నమ్మ అభ్యర్థికి నాలుగు ఓట్లు పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమిళంలో మాట్లాడుతూ.. దినకరన్‌ని గెలిపించాలని రాములమ్మ కోరుతున్నారు. మరోవైపు.. ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఆర్కేనగర్ స్థానాన్ని చేజిక్కించుకోవటం ద్వారా.. తమిళనాడు రాజకీయాల్లో అమ్మ వారసురాలిగా తన సీటును కన్ఫర్మ్ చేసుకునేందుకు శశికళ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తనకున్న పరిచయాల్ని ఆమె బయటకు తీస్తున్నారు. అందులో భాగంగానే విజయశాంతి ఆర్కేనగర్ ప్రచారంగా చెప్పొచ్చు.
సినిమాలతో తమిళులకు సుపరిచితురాలైన విజయశాంతి మాటల్ని ఇప్పుడు వారు వింటారా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. దాదాపు 15 ఏళ్ల కిందట ఆమె హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత తమిళులతో టచ్చింగ్ పోయిన ఆమె.. ఈ రోజు ఒక్కసారి తెర మీదకు వచ్చి.. ఓట్లు వేయమంటేవేసేస్తారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. విజయశాంతితోపాటు.. తమిళ నటుడు శరత్ కుమార్ ను కూడాపార్టీ తరఫున ప్రచారం చేసేందుకు బరిలోకి దింపారు చిన్నమ్మ. మరి.. ఇంత మందిని తీసుకొస్తున్న ఆమె ప్రయత్నాలకు ఆర్కేనగర్ ప్రజలుఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/