Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫ్రంట్ కు రాములమ్మ చురుక్కులు!
By: Tupaki Desk | 3 Jan 2019 6:32 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ తాజాగా గులాబీ దళపతి కేసీఆర్ పై జోకులు పేల్చారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఎద్దేవా చేశారు. కేసీఆర్ వేసుకున్న ముసుగు తొలగిపోయి ఆయన బీజేపీ మనిషన్న సంగతి త్వరలోనే ప్రజలకు తేటతెల్లమవుతుందని పేర్కొన్నారు.
బీజేపీ - కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే - కొత్త సంవత్సరం తొలి రోజున ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తనకు ఫెడరల్ ఫ్రంట్ సంగతే తెలియదన్నారు. ఈ వ్యవహారంపై తాజాగా రాములమ్మ స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్ ఫార్ములా కేసీఆర్ ప్రత్యర్థులకు అర్ధం కాలేదంటే లాజిక్ ఉందని పేర్కొన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అర్ధం కాలేదంటే మాత్రం ఆ ప్రయత్నంలోనే ఏదో లోపం ఉందేమోనన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు.
ప్రధాని మాటలు విన్న తర్వాతైనా బీజేపీకి అర్ధమయ్యే రీతిలో వాళ్ల సిద్ధాంతాలకు తగిన ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ కు రాములమ్మ సూచించారు. లేదంటే బీజేపీ కోసం కేసీఆర్ పడుతున్న కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందంటూ చురుక్కులంటించారు. ఇంగ్లీష్ - హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్ధ్యం ఉన్నప్పటికీ కేసీఆర్ చెప్పిన విషయం మోదీకి ఎందుకు అర్ధం కాలేదన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న అని విజయశాంతి ఎద్దేవా చేశారు.
వాస్తవానికి బీజేపీ రుణం తీర్చుకుందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని సాగనంపి - కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు దేశంలోని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ తరుణంలో యూపీఏ బలపడకుండా అడ్డుకునేందుకే మమతా బెనర్జీ - నవీన్ పట్నాయక్ లతో కలిసి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.