Begin typing your search above and press return to search.
కేసీఆర్ దేవుడిచ్చిన అన్న ఎంత మాత్రం కాదు!
By: Tupaki Desk | 30 Sep 2018 5:08 AM GMTసంచలన వ్యాఖ్యలు చేశారు రాములమ్మ. ఒకప్పుడు టీఆర్ ఎస్ లో మరే నేతకు దక్కనంత గౌరవాన్ని దక్కించుకోవటమే కాదు.. కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లెలుగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న విజయశాంతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో చేరి చాలా కాలమే అయినా.. ఎప్పుడూ గాంధీ భవన్ కు రాని ఆమె.. తొలిసారి వచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆత్మగౌరవం.. నిధులు.. నీళ్లు.. నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయశాంతి.. కేసీఆర్ ఎప్పటికీ తనకు దేవుడిచ్చిన అన్న ఎంత మాత్రం కాదన్నారు.
యుద్ధానికి తాను సిద్ధమవుతున్నానని.. విజయం సాధించి తీరుతామంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన విజయశాంతి.. శత్రువు బలంగా కనిపిస్తున్నారని.. బలం ఎంత ఉన్నా.. డబ్బులు ఎన్ని ఉన్నా.. తాము శత్రువును ఓడించి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. గతంలో అన్నాచెల్లెళ్లుగా ఉన్నకేసీఆర్.. విజయశాంతిలు శత్రువులు అయ్యారా? అంటూ సంధించిన ప్రశ్నకు సమాధానమిచ్చిన విజయశాంతి.. కాలం మారిందని.. పరిస్థితులు మారినట్లు చెప్పారు.
అన్నాచెల్లెళ్ల మధ్య జరిగే యుద్ధంలో ధర్మం గెలవాలని.. ప్రజలకు మేలు జరగాలన్నారు. కేసీఆర్ దేవుడిచ్చిన అన్న అని గతంలో చెప్పారుగా అన్న ప్రశ్నకు బదులిచ్చిన విజయశాంతి.. తాను అసలు ఆ మాటను అనలేదని.. తానే దేవుడిచ్చిన చెల్లెలు అని కేసీఆర్ అన్నారని గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ గా రంగంలోకి దిగనున్న విజయశాంతి... త్వరలో తన టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసుకోనున్నారు.